హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి పరీక్ష: నిద్ర పోలేదు, చంద్రబాబు నోట పరిటాల రవి ప్రస్తావన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచంలో ఏ మూల తెలుగువారికి ఎక్కడ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలకు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ సజీవంగా ఉంటుందని అన్నారు. తెలుగువారి హృదయాల్లో నుంచి పార్టీని తుడిచివేయడం ఎవరి వల్లా కాదంటూ ఒకింత ఉద్వేకంగా ప్రసంగించారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

‘తెలుగువారు ఎక్కడ ఉన్నా బాగుండాలి. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకూ తెలుగువారి ఉన్నతికి శ్రమిస్తాను. రాష్ట్ర విభజన టీడీపీకి ఒక పరీక్ష పెట్టింది. విభజనను నేను వద్దనలేదు. రెండు రాష్ట్రాలకూ న్యాయం జరిగేలా విభజన చేయాలని కోరాను. అది జరగలేదు.‘ అని అన్నారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

‘ఏపీకి కట్టుబట్టలతో వెళ్లాం. రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. విద్యా సంస్ధలు లేవు. ఆ రాష్ట్రాన్ని నేనైతేనే కాపాడగలనని ప్రజలు బాధ్యత అప్పగించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డామో ఆంధ్రప్రదేశలో అధికారంలో ఉండి కూడా అంత కష్టపడుతున్నాం.‘ అని ఎంతో ఆవేదనకు గురయ్యారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

‘తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయామని పార్టీ నేతలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత ఒక్క రోజు కూడా నిద్ర పోలేదు. ఆయన శ్రమను స్పూర్తిగా తీసుకోండి. మరో మూడేళ్లు శ్రమించండి. మీ వెనుక నేనున్నాను. మంచి రోజులు వస్తాయి' అని అన్నారు.

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

తెలంగాణలో ప్రతి కార్యకర్తనూ ఆదుకొని పార్టీని నిలుపుతామని భరోసా ఇచ్చారు. ‘గతంలో 24 గంటలూ ఇక్కడే ఉండేవాడిని కాబట్టి మీకు కొంత నిశ్చింతగా ఉండేది. నాకు ఇప్పుడు కూడా మీ మధ్యే ఉండాలని అనిపిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశలో బాధ్యతల వల్ల అటు వెళ్లక తప్పడం లేదు.‘ అని అన్నారు.

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

‘అమరావతిలో ఉన్నా నా మనసు మీతోనే ఉంటుంది. పోయిన వారి గురించి మనకు చింత అక్కర్లేదు. ప్రజల ఆశీస్సులతో ఇంకా మంచి నాయకత్వాన్ని తయారు చేసుకోగలుగుతాం' అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

ఇదే ఎన్టీఆర్‌ భవనలో ఉండి ఆనంద క్షణాలతో పాటు, సంక్షోభాలను చూశామని, పార్టీకి వెన్నెముక వంటి నేతలు బాలయోగి, మాధవరెడ్డి, ఎర్రన్నాయుడు, పరిటాల రవి, బాషా వంటివారు పోవడం దిగ్ర్భాంతి కలిగించినా ధైర్యం తగ్గకుండా ప్రయాణించామని చెప్పారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

‘కుటుంబానికి పెద్ద దిక్కు వంటి నేత హత్యకు గురైనా ఆ కుటుంబం పార్టీలోనే కొనసాగింది. అలాంటి కుటుంబాలు టీడీపీలో వేల సంఖ్యలో ఉన్నాయి. కొందరు నిరంతరం పార్టీ జెండాతోనే తిరుగుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కొందరు పార్టీని వీడలేదు. ఇలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీకి నాయకత్వం వహించగలగడం నా అదృష్టం. వారిని ఆదుకోవడానికి నా జీవితాంతం శ్రమిస్తాను' అని ఆయన పేర్కొన్నారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

టీడీపీ ఆవిర్భావ నుంచి పార్టీలోనే ఉంటున్న 23 మందిని చంద్రబాబు సన్మానించారు. వీరిలో యలమంచిలి గౌరంగబాబు(కృష్ణా జిల్లా), చిక్కుడు వెంకట సుబ్బయ్య(గుంటూరు), అద్దంకి తిరుమల రాజే్‌ష(ప్రకాశం), ధర్మవరపు సుబ్బారావు(నెల్లూరు), మఖ్దూం బుఖారీ(కడప)లు ఉన్నారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

వీరితో పాటు జిల్లెల శ్రీరాములు(కర్నూలు), మాలింగప్ప(అనంతపురం), ఎ.పరుశురామన(చిత్తూరు), వెలమల కామేశ్వరరావు(శ్రీకాకుళం), ఇప్పిలి అప్పలకొండ(విజయనగరం), కోరుకొండ రాంప్రసాద్‌(విశాఖపట్నం రూరల్‌), గంకాల అప్పారావు (విశాఖపట్నం అర్బన)లు ఉన్నారు.

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

ఇంకా నిడిమింటి సూర్య ప్రభాకరం(తూర్పు గోదావరి), మైలాబత్తుల ఐజాక్‌ బాబు(పశ్చిమ గోదావరి) ఉన్నారు. తెలంగాణలో సోమా గంగారెడ్డి(ఆదిలాబాద్‌), ఎండీ గౌసుద్దీన(మంచిర్యాల), అంబికా సత్యనారాయణ(నిజామాబాద్‌), తలకోటి రాజయ్య(కరీంనగర్‌), జి.జోగినాథ్‌ (మెదక్‌), పి.పద్మాకర్‌(రంగారెడ్డి), కప్పా కృష్ణాగౌడ్‌(హైదరాబాద్‌), గొర్ల మైబన్న(మహబూబ్‌నగర్‌), అబ్దుల్‌ అబ్దుల్‌ షమీ(నల్లగొండ), ఎర్రబెల్లి రామేశ్వరరావు(వరంగల్‌), రాయపూడి జయకర్‌రావు(ఖమ్మం)లను సన్మానించారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితరులు హాజరయ్యారు.

 రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

రాష్ట్ర విభజన టీడీపీకి పరీక్ష: ఆవిర్భావ వేడుకలో చంద్రబాబు ఉద్వేగం

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, హైదరాబాద్‌కు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

English summary
Andhra Pradesh Cheif minister Chandrababu Naidu participated in 35th TDP Formation day held at NTR Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X