హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డప్పు వాయించి - డాన్స్ మూమెంట్స్ తో మెగాస్టార్ : బ్లడ్ బ్యాంక్ పైనా ఆరోపణలు చేసారు..!!

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి డప్పు వాయించి స్టెప్పులు వేసారు. గాడ్ ఫాదర్ సక్సెస్ అయిందంటూ మురిసిపోయారు. అలయ్‌ బలయ్‌ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి ప్రత్యేకార్షణగా నిలిచారు. తనను ఈ కార్యక్రమానికి పిలవటం పైన సంతోషం వ్యక్తం చేసారు. 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ కుటుంబం ఈ కార్యక్రమం నిర్వహించటం పైన అభినందించారు. ఏ కార్యక్రమం అయినా కులం- మతం- ప్రాంతం లేదా సంబంధిత రంగానికి చెందిన వారితో జరుగుతుందని, ఈ కార్యక్రమం మాత్రం అన్నింటికీ అతీతంగా ఆత్మీయంగా జరిగే కార్యక్రమమని ప్రశంసించారు.

డప్పు వాయిస్తూ మెగా సందడి

డప్పు వాయిస్తూ మెగా సందడి

కళాకారులతో కలిసి చిరంజీవి డప్పు వాయించారు. స్టెప్పులతో అందిరలో ఉత్సాహం నింపారు. తనకు ఎంతో కాలంగా ఈ అలయ్ బలయ్ లో పాల్గొనాలని ఉండేదని చెప్పారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిలిచారు..అవకాశం దక్కింది కానీ, తనను ఎందుకు పిలవరా అని అనుకొనే వాడినని చెప్పుకొచ్చారు. దత్తాత్రేయ తనను ఆహ్వానించగానే ఖచ్చితంగా రావాలని డిసైడ్ అయ్యాయని పేర్కొన్నారు. గాడ్ ఫాదర్ విడుదల అయి సక్సెస్ అయిన మరుసటి రోజునే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.

నాటి సినిమా పరిస్థితుల గురించి

నాటి సినిమా పరిస్థితుల గురించి


1980వ దశకంలో సినీ అభిమానం పేరుతో చోటు చేసుకొనే పరిణామాల పట్ల తనకు ఏహ్యభావం ఉండేదన్నారు. వాల్ పోస్టర్లు చించటం.. వ్యతిరేకించటం వంటివి ఉండేవని గుర్తు చేసారు. తాను హీరోగా ఆ పరిస్థితులను మార్చాలని అనుకున్నానని చెప్పారు. తన సినిమా సక్సెస్ అయితే సాటి హీరోలను అందరినీ - సినీ ప్రముులను పిలిచి పార్టీ ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి ని దత్తాత్రేయ కాపాడుతున్నారని అభినందించారు. ప్రతీ ఒక్కరూ ఇలాంటి అలయ్ బలయ్ నిర్వహించాలని సూచించారు.

బ్లడ్ బ్యాంక్ పైనా కామెంట్స్ చేసారంటూ

బ్లడ్ బ్యాంక్ పైనా కామెంట్స్ చేసారంటూ


తాను బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ నిర్వహణ సమయంలో తన పైన రకరకాలుగా ఆరోపణలు చేసారని, కానీ తన చిత్తశుద్ది ఎలాంటిదో ఆ తరువాత ప్రతీ ఒక్కరూ గుర్తించారని చెప్పుకొచ్చారు. తాను మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో వచ్చిన ఆరోపణలను పట్టించుకోలేదన్నారు. ఎవరితో వైరం ఉన్నా..ఒక్క సారి ఇగో పక్కన పెట్టి దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటే అన్నీ మర్చిపోతారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత వీహెచ్‌ కూడా కళాకారులతో డప్పు వాయించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు-పలు రాష్ట్రాల గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Chiranjeevi key comments on Alai balai programme in Hyderabad, praises Governor Dattatreya for orgnaising this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X