హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీ గడువు, అంతివ్వలేని కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డిసెంబర్ నాటికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు) నిర్వహిస్తామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే, అంత సమయం ఇవ్వలేమని కోర్టు తెలిపింది. దీనికిసంబంధించిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ప్రభుత్వం 249 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కౌంటర్‌ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సుమారు 200 రోజులు అవసరమని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.

High Court adjourned GHMC election case

వార్డుల పునర్విభజన ప్రక్రియ నడుస్తోందని, ఇందుకోసం ఇటీవల జీవో జారీ చేశామని కోర్టుకు వెల్లడించింది. ఐఏఎస్‌ల కేటాయింపు ఇటీవల జరిగిందని చెప్పింది. అయితే అంత సమయం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తేదీలు పునఃపరిశీలించి మరో తేదీ ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

English summary
High Court adjourned GHMC election case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X