వెతికి పట్టుకొచ్చి మరీ.. మహిళను మూడో అంతస్తు నుంచి తోసేశాడు..

కుమారుడు మహమ్మద్ వాజిద్ సూచన మేరకు హసీనా సౌదీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి డబ్బు సంపాదిస్తే కుటుంబం బాగా బతకవచ్చని వాజిద్ ఆమెకు సూచించాడు.

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన హసీనా బేగమ్(45) అనే ఓ మహిళ సౌదీ అరేబియాలో దాడికి గురైంది. హసీనా పనిచేస్తున్న ఇంటి యజమాని కఫీల్ ఆమెను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేయడంతో తీవ్ర గాయాలపాలైంది. సౌదీలోని దామమ్ లో ఈ ఘటన జరగ్గా ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి.

తన యజమాని కఫీల్ నుంచి తనను రక్షించాలని హసీనా బేగమ్ వేడుకుంటోంది. కాగా, హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన హసీనా 2016లొ సౌదీ అరేబియా వెళ్లింది. కుమారుడు మహమ్మద్ వాజిద్ సూచన మేరకు హసీనా సౌదీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి డబ్బు సంపాదిస్తే కుటుంబం బాగా బతకవచ్చని వాజిద్ ఆమెకు సూచించాడు.

HYDERABAD WOMAN PUSHED BY SAUDI EMPLOYER FROM 3RD FLOOR OF THE BUILDING

సౌదీకి వెళ్లేముందు ఆమె పనికి కుదిరిన యజమాని నెలకు 1600రియోలు చెల్లిస్తానని మాటిచ్చాడు. ఈ మేరకు ఒప్పందం కూడా జరగ్గా.. ఇంతవరకు ఆమెకు నయా పైసా కూడా చెల్లించలేదు. వేధింపులు తాళలేక ఇంటినుంచి తప్పించుకుని ప్రయత్నం చేయగా.. వెతికి మరీ పట్టుకొచ్చి హసీనాను కలీఫ్ మూడో అంతస్తును కిందకు తోసేశాడు.

లోకల్ ఏజెంట్ మోసానికి హసీనా బలైపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు ఒప్పందాలతో వారిని సౌదీకి తీసుకెళ్లి అక్కడ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+