ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడటం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడుతున్న విషయాన్ని ఖరారు చేసారు. అటు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నేత లు జీవన్ రెడ్డితో టచ్ లోకి వచ్చారు. అయితే, జీవన్ రెడ్డికి వస్తున్న ఆఫర్ల వేళ ఏ పార్టీలో చేరేదీ జీవన్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి సేవలందించారు. అయితే, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఆయనకు ఏమాత్రం పొసగడం లేదు. సంజయ్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పైగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంజయ్ కుమార్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక, కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తన మద్దతు దారులతో జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్న అంశం స్పష్టం చేసారు. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన వేళ బీజేపీ నేతల నుంచి భారీ ఆఫర్ రావటం తో సందిగ్ధంలో పడ్డారు. మాజీ మంత్రి నేరుగా జీవన్ రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. మద్దతు దారులతో చర్చల తరువాత జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలనేది డిసైడ్ అయ్యారు.

అనచరులతో కలిసి కాంగ్రెస్ కు రాజీనామా..!
మూడు నియోజకవర్గాలకు చెందిన తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. పార్టీ మార్పు పైన క్లారిటీ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ వీడుతుందీ వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగిస్తోంది. పార్టీ వీడవద్దని ముఖ్య నేతలు కోరుతున్నారు. తాజాగా సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో జీవన్ రెడ్డి మరింత ఆగ్రహంతో ఉన్నారు. తాను కాంగ్రెస్ లో కొనసాగలేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ తో సైతం జీవన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. జీవన్ రెడ్డి అనుభవానికి అనుగుణంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పై నిరసనలో భాగంగా రైతులతో కలిసి జీవన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక













Click it and Unblock the Notifications