16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదా?: కేటీఆర్ ఆశ్చర్యం
హైదరాబాద్: 'పారిశుధ్య కార్మికుడు వెంకటయ్య చేస్తున్నది దేశ సేవ. ఆయన సేవలు కార్మికులందరికీ ఆదర్శం' అని మంత్రి కేటీఆర్ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ వెంకటయ్యను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిన వెంకటయ్య స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తమ తమ రంగాల్లో అంకితభావంతో పనిచేయాలని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యాన్ని చేరుకునేందుకు వెంకటయ్య వంటి కార్మికుల పనితీరు, సేవాభావమే స్ఫూర్తి అన్నారు.
నగరంలో పని చేసే ప్రతిఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి వెంకటయ్య ఆదర్శమని అన్నారు. దేశం మొత్తంలో కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేవలం ఇద్దరిని ఉత్తమ కార్మికులుగా గుర్తించగా.. వారిలో ఒకరు టీ వెంకటయ్య కావటం అభినందనీయమని మంత్రి అన్నారు.

16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు?: కేటీఆర్ ఆశ్చర్యం
గత 16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా వెంకటయ్య సెలవు తీసుకోలేదని తెలిసి మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలవు తీసుకోకుండా విధులకు హాజరవడం ఎలా సాధ్యం? అని అడిగారు. తన పరిధిలో రోడ్లు శుభ్రంగా లేకుంటే నిద్ర పట్టదని, అందుకే 16 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నట్టు వెంకటయ్య సమాధానమిచ్చారు.

16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు?: కేటీఆర్ ఆశ్చర్యం
ఈ సందర్భంగా కేటీఆర్ వ్యక్తిగతంగా రూ.1,11,111 చెక్కును ఆయనకు అందజేశారు. దీనికి అదనంగా జీహెచ్‌ఎంసీ నుంచి మరో లక్ష రూపాయల చెక్కును వెంకటయ్యకు అందించి శాలువతో సత్కరించారు. అంతేకాదు ఢిల్లీలో అవార్డు తీసుకునేందుకు వెళుతున్న వెంకటయ్యకు అన్నిరకాల ఏర్పాట్లను చేయాలని జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.

16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు?: కేటీఆర్ ఆశ్చర్యం
ఇదిలా ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జాతీయ స్థాయిలో కేంద్రం ఇద్దరు కార్మికులను ఎంపిక చేసింది. ఆయన నిబద్ధత, సమయపాలన, పని విధానాన్ని పరిగణలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి ఉత్తమ కార్మికుడిగా గుర్తించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదించారు.

16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు?: కేటీఆర్ ఆశ్చర్యం
ఇలాంటి ప్రతిపాదనలు దేశంలోని వివిధ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల నుంచి కూడా అందాయి. వీటన్నింటిని పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇద్దరిని ఉత్తమ కార్మికులుగా గుర్తించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్య, కోయంబత్తూర్‌కు చెందిన మరో కార్మికుడు ఉన్నారు.

16 ఏళ్ల సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు?: కేటీఆర్ ఆశ్చర్యం
కేంద్ర మున్సిపల్, పట్టణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్న 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా వెంకటయ్య అవార్డును అందుకోనున్నారు.