తెలంగాణాలో మావోయిస్టుల అలజడి: రంగంలోకి ఎస్పీలు; భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టుల దళం వచ్చిందన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎస్పీలే రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు మండలాల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు వారం రోజుల క్రితం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కైలాష్ టెక్డి సమీపంలో గ్రెనేడ్ లభించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో మావోయిస్టుల అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.

మావోయిస్ట్ ల కదలికలతో ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో జోరుగా కూంబింగ్
2020 సెప్టెంబరులో కదంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని, మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారని పోలీసులు అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, భాస్కర్ దళంలోని 10 మంది మావోయిస్టులపై పోలీసులు 95 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టుల కదలికలతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రంగంలోకి ఆదిలాబాద్, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు
ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహాయం చేయవద్దని, మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అంతేకాదు ఇంటింటికి తిరిగి ప్రతి ఇల్లు జల్లెడ పడుతున్నారు ఎస్పీలు. ఎవరూ మావోయిస్టుల మాయలో పడొద్దని, వారికి సహకరించవద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

రంగంలోకి దిగిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ .. అటవీ ప్రాంతంలో గాలింపు
ఇక తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కూడా రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం ఉందని చెప్పిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మావోయిస్టులు, వారిని ప్రభావితం చేస్తున్నారని ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందుకే తాము ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజనులకు ఈ విషయంలో అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకారం అందించి భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

పోలీసులకు మావోలకు మధ్య నలిగిపోతున్న గిరిజన గ్రామాల ప్రజలు
ఇక మావోయిస్టులు సంచరిస్తున్నారన్నకారణంగా పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం, ఇంటింటినీ జల్లెడ పడుతున్న తీరుతో గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య గిరిజన గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications