విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సురభి నాగేశ్వరరావు కన్నుమూత: తీరని లోటంటూ సీఎం కేసీఆర్ సంతాపం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గ్రహీత సురభి నాగేశ్వర రావు అలియాస్ సురభి బాబ్జి(76) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శతాబ్దానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కొనియాడారు.

తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడిగా, నాటక రంగానికి నాగేశ్వర రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. నాగేశ్వర రావు మరణం సురభి సంస్థకే కాకుండా, యావత్తు నాటక రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 surabhi nageswara rao passes away: CM KCR condoles

సురభి ప్రస్థానం: వరించిన అవార్డులు

కాగా, దేశ విదేశాల్లో సురభి నాటకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రాణం పోసిన బాబ్జీని 2013లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 125 ఏళ్ల సురభి నాటక సమాజానికి పద్మశ్రీ తెచ్చిన ఘనత నాలుగో తరానికి చెందిన బాబ్జిదే. 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ, బళ్లారి రాఘవ, ఎన్టీఆర్ పురస్కారాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయ నగరం జిల్లా గజపతినగరంలో జన్మించిన బాబ్జి తన నాలుగో ఏటా రంగస్థల ప్రవేశం చేశారు.

ఆనాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్, పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు లాంటి హేమాహేమీలతో ప్రశంసలు అందుకున్న మేటి కళాకారుడు, అంతకు మించి గొప్ప ఆర్గనైజర్ బాబ్జీ. బాబ్జి అసలు పేరు రేకందర్ నాగేశ్వర రావు. అందరికి సురభి బాబ్జిగా సుపరిచితులు. శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి బాధ్యతలు చేపట్టి గత నాలుగు దశాబ్దాలుగా 35 కుటుంబాలకు అండగా నిలిచారు. పిల్లలు లేని లోటును ఆ ఐదు సమాజాలకు చెందిన 70 మంది కళాకారులను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు.

గరిమెళ్ల రామ్మూర్తి, మొదలి నాగభూషణ శర్మ, బీవీ కారంత్​ల సాన్నిహిత్యం ఆయన్ని గొప్ప కార్య నిర్వాహకుడిగా మార్చింది. డాక్టర్ కేవీ రమణాచారి, డాక్టర్ అర్జా శ్రీకాంత్ లాంటి అధికారుల అండదండలతో లలిత కళాతోరణంలో 15 ఏళ్ల పాటు శాశ్వత థియేటర్ ఏర్పాటు చేసుకుని టికెట్ డ్రామాలు కొనసాగించారు. ఫ్రాన్స్‌లో ప్రత్యేక సురభి ప్రదర్శనలు ఇచ్చారు. కరోనా సమయంలో కూడా అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లోని తెలుగు వారి కోసం నాటకాలు ప్రదర్శించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేలా చేశారాయన.

English summary
surabhi nageswara rao passes away: CM KCR condoles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X