హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: ఉద్యోగాల నోటిఫికేషన్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న తెలంగాణలోని నిరుద్యోగులకు ఇది శుభవార్తే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.

పోలీసు, ఉపాధ్యాయ పోస్టులతోపాటు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారముందని, ఏ శాఖలో ఎంతమంది అవసరమో లెక్క తేల్చాక అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 telangana government decided to release notification for job vacancies soon

సీఎం ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే తమ కలను నెరవేర్చుకుంటామని అంటున్నారు.

English summary
telangana government decided to release notification for job vacancies soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X