కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!!
కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ పైన కసరత్తు మొదలు పెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు వేచి చూస్తున్నారు. కాగా, 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు వీరికి అమలు విషయం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పెన్షన్ల మంజూరు పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెలనెలా పింఛన్లను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష మందికి పింఛన్లను మంజూరు చేశామని, వచ్చే ఆర్ధిక సంవత్సరం లో రెండు లక్షల పింఛన్లను కొత్తగా జారీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. ఇప్పటికే బడ్జెట్‌లో వీటిని నిధులను కూడా కేటాయించి నట్లు వివరించారు. తాజాగా అసెంబ్లీలోనూ కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

భారీగా దరఖాస్తులు.. రెండు లక్షల మందికి మంజూరు
కాగా, కొత్త పెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల మంది వేచి చూస్తున్నారు. గత నెల 20 నుంచి ప్రజావాణి, ఇతర వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గ్రామసభల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు దాదాపు 12 లక్షలు ఉండగా.. వీరిలో రెండు లక్షల మందిని ఎంపిక చేయటం అధికార యంత్రాంగానికి సవాల్ గా మారుతోంది. వృద్ధాప్య పెన్షన్ల కోసమే నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసారు. దీంతో.. వీటిని వడపోత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. అర్హత ఉన్న వారి సంఖ్య పైన ఆరా తీస్తోంది. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది.
-
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
సామాన్యులు, విద్యార్థులపై మరో భారం - ఛార్జీలు ఏకంగా 50 శాతం పెంపు..!! -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..













Click it and Unblock the Notifications