హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలో కబేళాలు: 'బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కబేళాలను నెలకొల్పినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాంనాస్‌పురా, అంబర్‌పేట, న్యూబోయిగూడలోని మేకలమండిలో నిర్మించిన అత్యాధునిక జంతు వధశాలలను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాంనాస్‌పురాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నామమాత్రపు ఫీజు రూ. 100 చెల్లించి కబేళాల్లోనే జంతువధ జరిగేలా సహకరించాలని కోరారు. ఇకనుంచి ఎవ్వరూ బజార్లలో విచ్చలవిడిగా అక్రమ జంతువధ చేయవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు.

రోడ్లపై కాలుష్యం, వ్యర్థాలు వేయడంవల్ల నాలాలు కాలుష్యం, దీనిద్వారా అంటువ్యాధులు, భూగర్భజలాలు కలుషితం కావడంతో పాటు నగర ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. వీటిని నివారించేందుకే అత్యాధునిక జంతువధశాలలను ఏర్పాటుచేశామన్నారు. ఈ రంగంలో కొనసాగుతున్న వ్యాపారుల ఉపాధి ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తామన్నారు.

రామ్‌నాస్‌పురలోని జంతువధశాల సామర్ధ్యం 300 పశువులు కాగా, స్థానిక అవసరాలు తీరిన తరువాత మిగిలినవి ఎగుమతులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కబేళాలో మాంసం ఉత్పత్తి జరిగిన తరువాత వెలువడే వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంటును ఏర్పాటుచేశామన్నారు.

ఈ ప్లాంటును త్వరలోనే ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్లాంటు నిర్వహణకు ఇదివరకే టెండర్లు ఆహ్వానించగా, సింగిల్ టెండర్ రావడంవల్ల రీటెండర్ పిలిచినట్లు మంత్రి చెప్పారు. వచ్చేనెల ఒకటోతేదీ వరకు టెండర్లు ఖరారయ్యే అవకాశముందన్నారు.

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్


నూరు రోజుల ప్రణాళికను వచ్చేనెల రెండవ తేదీలోగా పూర్తిచేయాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేనందున జూన్ రెండో వారానికి వాయిదా వేసినట్లు చెప్పారు. జూన్ రెండవ వారంలో నూరు రోజుల ప్రణాళిక ప్రగతి నివేదికను విడుదలచేస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక పద్ధతుల్లో కబేళాలను ఏర్పాటుచేశామన్నారు.

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్


ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి పాతబస్తీపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అందుకే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటీవలే బండ్లగూడలో డ్రైవింగ్ లైసెన్సులు పొందే వెసులుబాటు కల్పించామన్నారు.

 బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్


ఇదేకాకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మజ్ల్లిస్ పార్టీతో కలిసి పాతబస్తీ అభివృద్ధికి ముందుకు సాగుతామని మంత్రి స్పష్టంచేశారు.

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్


స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నూరు రోజుల ప్రణాళికను రూపొందించి అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. 8.61కోట్లతో రామ్‌నాస్‌పుర, రూ. 22.5కోట్లతో అంబర్‌పేట్, రూ. 14.92కోట్లతో న్యూబోయిగూడలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కబేళాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్


నూరు రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన మార్కెట్లు, బస్‌బేల నిర్మాణంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. వాటి పనితీరు ఆశించినస్థాయిలో లేదని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా అవి గడువులోగా పూర్తయ్యే అవకాశం కూడా లేదని చెప్పారు. అందుకే ముందు అనుకున్న విధంగా నూరు రోజుల ప్రణాళిక గడువును జూన్ రెండవ తేదీనుంచి జూన్ రెండవ వారానికి వాయిదా వేస్తున్నామన్నారు.

 బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

బజార్లలో అక్రమ జంతు వధ చేయొద్దు: కేటీఆర్

మూడు కబేళాల ప్రారంభం సందర్భంగా మంత్రి ఈ మూడు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. రామ్‌నాస్‌పుర కార్యక్రమంలో స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఎమ్మెల్యేలు బలాల, షకీల్, ఎమ్మెల్సీ సలీం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ పాల్గొనగా, న్యూబోయిగూడలోని కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే వివేక్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

English summary
The modern slaughter houses at Amberpet, Bhoiguda and Ramnaspura, pending for inauguration since the past few years, were finally inaugurated by Municipal Administration and Urban Development (MA&UD) minister K T Rama Rao on Thursday. Responding to the plea of MP Asaduddin Owaisi, the minister assured that works on Chengicherla rendering plant would also be taken up shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X