వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తౌక్టే ప్రభావం.!హైదరాబాద్ లో భారీ వర్షం.!జలమయమైన రహదారులు.!కొన్నిచోట్ల విరిగిన చెట్లు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిన్నటి వరకూ ఎండ తీవ్రతతో భగభగమండిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం ఉదయమే వర్షం పడడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర పాలక సిబ్బంది అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రహదారుల పైన వర్షం నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటునన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తౌక్టే తుపాను కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 నగరంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

నగరంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

తౌక్టే ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. వర్షం కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతల్తో మార్పు చోటుచేసుకుంది. గతంలో కొద్ది పాటిజల్లులకే లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమయ్యేయి. జీహోచ్ ఎంసీ సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్ధితిలు కాస్త మెరుగయినట్టు తెలుస్తోంది. వర్షం పడుతుందని ముందస్తు సమాచారంతో నగరపాలక సంస్ద సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రదాన రహదారుల్లో ఎక్కడా వర్షం నీరు నిలవకుండా ముందుస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

 తౌక్టే తుఫాన్ ప్రభావం.. భారీగా కురుస్తున్న వర్షాలు..

తౌక్టే తుఫాన్ ప్రభావం.. భారీగా కురుస్తున్న వర్షాలు..

అంతే కాకుండా తౌక్టే తుఫాన్ ధాటికి తీర‌ప్రాంతాలు వణికిపోతున్నాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాలపై తీవ్ర ప్రబావం చూపుతోంది. ఇక‌, దీని ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల‌పై కూడా పనిచేస్తోంది. హైద‌రాబాద్‌లో ఈ ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది. ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఉద‌యం నుంచే భారీ వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది. మాదాపూర్‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూక‌ట్‌ప‌ల్లి, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌, చిక్క‌డ‌ప‌ల్లి, కోఠీలో కురిసిన భారీ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.

 మునిగిపోతున్న నార్త్ ఇండియా.. రేబియా సముద్రంలో తౌక్టే అల్లకల్లోలం

మునిగిపోతున్న నార్త్ ఇండియా.. రేబియా సముద్రంలో తౌక్టే అల్లకల్లోలం

మరోవైపు గుజరాత్‌ వద్ద తౌక్టే తుపాను తీరాన్ని తాకినట్టు తెలుస్తోంది. అరేబియా సముద్రంలో తౌక్టే అల్లకల్లోలం సృష్టించింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌‌లలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పోర్‌బందర్‌-మహువాల దగ్గర తీరం దాటిన తుఫాను భయంకరంగా పరిణమించింది. వెరవల్‌-సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

 లాక్‌డౌన్ సడలింపుల్లో సడేమియా.. వర్షంతో ఇబ్బందిపడ్డ చిరు వ్యాపారులు..

లాక్‌డౌన్ సడలింపుల్లో సడేమియా.. వర్షంతో ఇబ్బందిపడ్డ చిరు వ్యాపారులు..

మొత్తానికి మే నెల ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎండతీవ్రతతో, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న జనాలు కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది. నగరం మొత్తం కూడా జల్లులు కురవడంతో ఆహ్లాద వాతావరణం చోటుచేసుకుంది. కాని లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో ప్రజలెవ్వరూ బయటకు రాలేని పరిస్ధితులు నెలకొన్నాయి. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకే సడలింపులు ఉండడం, అదే సమయంలో భారీ వర్షం పడడం నగర వాసులను కాస్త ఇబ్బందులకు గురిచేసిందని తెలుస్తోంది. నిత్యావసర వస్తువులు కొనుక్కునే వారు, ఇతర అవసారాలకు బయటకు వెళ్దమనుకునే వారికి వర్ష బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. ఇక చిరు వ్యాపారులు, కూరగాయల వి తక్కువ సమయంలో తమ వ్యాపారాలను అయినప్పటికి వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రకృతి రమణీయంగా మారిందనే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలరు.

English summary
Relaxation from 6am to 10am, while heavy rain at the same time seems to have caused some trouble for the city dwellers.It seems to have put a rain brake on those who buy essentials and those who want to go out for other necessities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X