విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభాస్‌కు నై..చిరుకు సై: తెర వెనుక చక్రం తిప్పిందెవరు: జగన్ అంగీకారం వెనుక!

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావించిన సైరా సినిమా విడుదల అయింది. ఆయన తనయుడు రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాత. సినిమా పైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే..ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఇదే ఏపీ ప్రభుత్వం సాహోకు ఇదే రకంగా అభ్యర్ధన వస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభాస్ సినిమాకు అనుమతి ఇవ్వని జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు చిరంజీవి సినిమాకు మాత్రం అడ్డు చెప్పలేదు. అయితే..చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అదనపు షోలకు అనుమతి కూడా ఏపీ ప్రభుత్వం చివరి నిమిషంలో ఇచ్చింది. అప్పటి వరకు పక్కన పెట్టిన అభ్యర్దన గురించి ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రముఖులు రాయబారం నడిపారు. అంతే వెంటనే అనుమతికి ఓకే చెప్పేసారు. రాత్రి పొద్దపోయాక అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే...ఇంతకీ జగన్ అనుమతి ఇవ్వటం వెనుక కారణం ఏంటి..ఆ సమయంలో చిరంజీవి తరపున చక్రం తిప్పిందెవరు..

డ్యూటీకి డుమ్మా కొట్టి సైరా చూసిన ఎస్పైలు.. జిల్లా ఎస్పీ సీరియస్డ్యూటీకి డుమ్మా కొట్టి సైరా చూసిన ఎస్పైలు.. జిల్లా ఎస్పీ సీరియస్

సైరా ప్రత్యేక షోలకు అనుమతి వెనుక..

సైరా ప్రత్యేక షోలకు అనుమతి వెనుక..

ఏపీలో సాహో సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటంతో ఇక సైరా సినిమాకు కూడా సాధ్యం కాదని అందరూ భావించారు. అందునా చిరంజీవి సినిమా కావటంతో అది సాధ్యపడదనే చర్చ వినిపించింది. అయితే..మరి కొద్ది గంటల్లో సినిమా విడుదల అవుతుందనే సమయంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల రోజు నుండి ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ఏడు రోజుల పాటు తెల్ల వారు జామున ఒంటి గంట నుండి పది గంటల వరకు ప్రత్యేక అనుమతి జారీ చేసింది.అయితే..అప్పటికే సినిమా నిర్మాణ సంస్థ ప్రత్యేక షో లపైన ఆశలు వదుకులుంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఒక పరిణామం మొత్తం నిర్ణయాన్నే మార్చేసింది. అనుమతి రావటానికి కారణమైంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుండి లేఖ

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుండి లేఖ

సైరా సినిమా విడుదల చేస్తున్న సమయంలో తమకు వారం రోజుల పాటు ఏపీలో ప్రత్యేకంగా షో లు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సైరా చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సెప్టెంబర్ 9న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని పైన అధికారులు ప్రభుత్వంలోని ముఖ్యులకు వివరించారు. ముఖ్యమంత్రికి చెప్పిన తరువాత నిర్ణయం తీసుకుందామని ఉన్నత అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. అయితే..సరిగ్గా అక్టోబర్ రెండో తేదీన సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి సీఎం వద్దకు వెళ్లారు. విషయం వివరించారు.

చక్రం తిప్పిన కీలక వ్యక్తి..సహకరించిన మంత్రి

చక్రం తిప్పిన కీలక వ్యక్తి..సహకరించిన మంత్రి

అదే సమయంలో ముఖ్యమంత్రికి సైతం ప్రముఖ ఆస్పత్రికి చెందిన కీలక వ్యక్తి నేరుగా మాట్లాడారని విశ్వసనీయ సమాచారం. ఏపీకి చెందిన మహనీయుడి జీవిత చరిత్ర..అందునా రాయలసీమ నుండి వెలుగు లోకి రాని వ్యక్తి గురించి తీసిన సినిమా ప్రత్యేక షో లకు వీలుగా అవకాశం ఇవ్వాలని నేరుగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. అదే సమయంలో గతంలో చిరంజీవికి దగ్గరగా ఉంటూ..ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ కు నమ్మకస్తుడుగా ఉన్న మరో నేత సైతం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో చంద్రబాబు హాయంలో గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి సొంత వారి సినిమాలనే ప్రమోట్ చేయటం.. మినహాయింపులు ఇవ్వటం చేసారని.. మరో ప్రముఖ సినిమా విషయంలో విరుద్దంగా వ్యవహరించారని గుర్తు చేసారు. ఇక..రాజకీయ కోణంలోనూ చర్చ జరిగింది.

అంగీకరించిన జగన్..

అంగీకరించిన జగన్..

సినిమాకు ప్రత్యేక షో లకు అనుమతి ఇవ్వాలని చిరంజీవికి చెందిన దగ్గరి వ్యక్తి కోరటం..ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావటంతో సీఎం జగన్ వెంటనే ఓకే చెప్పేసారు. ఇక.. చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ను సైతం జగన్ పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో సాహోకు అనుమతి నిరాకరణ..ఇప్పుడు అనుమతి ఇవ్వటం పైనా ప్రభుత్వ సమాధానం సిద్దం చేసుకుంది. సైరా దేశభక్తుడి సినిమా కావటంతోనే అనుమతి ఇచ్చినట్లుగా చెప్పాలని సిద్దపడింది. అయితే..ఆ ప్రశ్న అసలు ఎదురయ్యే అవకాశం లేదని ఆ ప్రముఖుడు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో.. ఎట్టకేలకు సైరా ప్రత్యేక షో లకు అనుమతి లభించింది.

English summary
Special show's permission for Syra movie given by Ap govt by Cm Jagan orders. Sources said that A famous Hospital key person reccomanded Cm to give permission. Then Jagan considered the request and given orders for cinema producer request.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X