హోం
 » 
కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా, మేఘాల‌యా మాజీ ముఖ్య‌మంత్రి పీ. ఏ.

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా, మేఘాల‌యా మాజీ ముఖ్య‌మంత్రి పీ.ఏ. సంగ్మా కుమారుడు. చ‌దువు పూర్త‌యిన వెంట‌నే రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. పెన్సిల్వేనియా విశ్వ‌విద్యాల‌యంలోని వార్ట‌న్ స్కూలు నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ ఇన్ ఎంట‌ర్‌ప్రెన్యూర‌ల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీని పూర్తి చేశారు. లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజీ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

2004 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న తొలిసారి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో 182 ఓట్ల‌ తేడాతో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2008లో త‌న సోద‌రుడితో క‌లిసి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 2016 మార్చిలో త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం, ఆయ‌న నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ అధ్య‌క్షుడ‌య్యారు. అనంత‌రం 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయన పార్టీ 19 సీట్ల‌ను గెలుచుకుని, మ‌రికొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గా, సంగ్మా మేఘాలయా ముఖ్య‌మంత్రి అయ్యారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ఆర్థిక శాఖా బాధ్య‌త‌ల‌ను కూడా ఆయ‌నే చూస్తున్నారు. ఆయ‌న‌కు ఒక సోద‌రుడు, ఇద్ద‌రు సోద‌రిలు ఉన్నారు. ఆయ‌న సోద‌రుడు జేమ్స్, సోద‌రి అగాథా కూడా రాజ‌కీయ నాయ‌కులే కావ‌డం విశేషం.

మరిన్ని చదవండి
By Shalini Updated: Monday, April 29, 2019, 05:26:05 PM [IST]

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా
పుట్టిన తేదీ 27 Jan 1978 (వ‌య‌స్సు  46)
పుట్టిన ప్రాంతం తుర‌, ప‌శ్చిమ గారో హిల్స్‌, మేఘాల‌యా
పార్టీ పేరు Nationalist Congress Party
విద్య
వృత్తి వ్యాపార‌వేత్త‌, రాజ‌కీయ, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు పూర్ణో అజిటోక్‌ సంగ్మా
తల్లి పేరు సోరదినీ కోంగ్‌క‌ల్ సంగ్మా
మతం క్రైస్తవత్వం
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹13.83 CRORE
ఆస్తులు :₹14.07 CRORE
బాధ్యతలు: ₹24.13 LAKHS

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

సంగ్మా, ఆయ‌న సోద‌రుడు జేమ్స్, 2008 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి ఒకేసారి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. 2008 లో మంత్రిగా అరంగేట్రం చేసిన 10 రోజుల్లోనే, తొలి వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా రాజకీయ జీవితం

2018
  • 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న తుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి, మేఘాల‌యా 12వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
2016
  • 2016 సెప్టెంబ‌రులో ఆయ‌న ఇంధ‌న స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2016
  • తుర నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో గెలిచి, 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న 1.92 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్య‌త‌తో గెలుపొందారు.
2009
  • 2013 వ‌ర‌కు మేఘాల‌యా శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.
2008
  • రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆర్థిక‌, విద్యుత్తు, ప‌ర్యాట‌కం, సాధార‌ణ ప‌రిపాల‌న, ఐటీ మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.
2008
  • సెల్‌సెల్లా నియోజ‌క‌వ‌ర్గం నుంచి క్లెమెంట్ మారాక్ పై నెగ్గి, ఆయ‌న మేఘాల‌యా శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
2003
  • 2003 లో తొలిసారిగా ఆయ‌న సెల్‌సెల్లా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. అయ‌తే ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న క్లెమెంట్ మారాక్ చేతిలో 182 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1990s
  • నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), త‌న తండ్రి పీ ఏ సంగ్మా త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తూ, కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.

గ‌త చ‌రిత్ర

2009 May
  • డాక్టర్ మెహ‌తాబ్ చాందీని సంగ్మా వివాహమాడారు.

కాన్రాడ్ కోంగ్‌క‌ల్ సంగ్మా సాధించిన విజయాలు

విద్యా, ప‌ర్యావ‌ర‌ణ రంగాల్లో కృషి చేసే పీ ఏ సంగ్మా ఫౌండేష‌న్‌కు ఆయ‌న ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్నారు. మేఘాల‌యాలో ఆయ‌న ప్ర‌స్తుతం నాలుగు కాలేజీల‌ను నిర్వ‌హిస్తున్నారు. మేఘాల‌యా క్రికెట్ అసోసియేష‌న్, స్పోర్ట్స్ అకాడ‌మీ అధ్య‌క్షుడిగానూ ప్ర‌స్తుతం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X