Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్
ఓక్రామ్ ఇబోబీ సింగ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. మ‌ణిపూర్ రాష్ట్రానికి 2002 నుంచి 2017 వ‌ర‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
By Eileen Singh | Monday, April 29, 2019, 05:26:05 PM [IST]

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఓక్రామ్ ఇబోబీ సింగ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. మ‌ణిపూర్ రాష్ట్రానికి 2002 నుంచి 2017 వ‌ర‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఓక్రామ్ ఇబోబీ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌వారు. 2012 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ, మొత్తం 60 అసెంబ్లీ స్థానాల‌కుగానూ 42 సీట్ల‌ను గెలుచుకుంది.

ఓక్రామ్ ఇబోబీ సింగ్ చాలా పేద కుటుంబంలో జ‌న్మించారు. చిన్న‌త‌నంలో ఆయ‌న త‌న తండ్రికి ఆయ‌న వృత్తిలో సాయ‌ప‌డుతుండేవారు. ఇంఫాల్‌లోని డీ.ఎం. కాలేజీ నుంచి ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఎల్‌. లాంధోనీ దేవీని ఆయ‌న పెళ్లాడారు. తౌభాల్ జిల్లాలోని ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తౌభాల్ జిల్లాలోనే ఆమె తొలి మ‌హిళా ఎమ్మెల్యే కావ‌డం విశేషం.

మరిన్ని చదవండి

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఓక్రామ్‌ ఇబోబీ సింగ్
పుట్టిన తేదీ 19 Jun 1948 (వ‌య‌స్సు  77)
పుట్టిన ప్రాంతం మ‌ణిపూర్
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate
వృత్తి రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు ఓక్రామ్ అంగౌబీ
తల్లి పేరు లూకామ‌ణి దేవీ
జీవిత భాగస్వామి పేరు లాంధోనీ దేవీ
జీవిత భాగస్వామి వృత్తి రాజ‌కీయ, సామాజిక కార్య‌క‌ర్త
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹1.04 CRORE
ఆస్తులు
₹1.36 CRORE
బాధ్యతలు
₹31.76 LAKHS

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్నిసార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. 2006 న‌వంబ‌రులో, ఓక్రామ్ ఇబోబీ సింగ్ ఇంటిపై పీపుల్స్ రిల్యూష‌న‌రీ పార్టీ ఆఫ్ కాంగ్లేయీప‌క్‌ (ప్రీఆర్ఈపీఏకే) దాడి చేసింది. ఇంఫాల్‌లోని, బాబుప‌రా అధికారిక నివాసంలో ఆయ‌న నిద్రిస్తున్న‌ప్పుడు, సెప్టెంబ‌రు 2, 2008 నాడు మ‌ణిపూర్ విప్ల‌వ స‌భ్యులు ఆయ‌న ఇంటిపై దాడి చేశారు.

ఓక్రామ్‌ ఇబోబీ సింగ్ రాజకీయ జీవితం

  • 2017 : 2017 మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్ తౌబాల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యేగా గెలిచారు. ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి లేయితాంతేమ్ బ‌సంత సింగ్‌పై 18,649 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలిచారు.
  • 2017 : మ‌ణిపూర్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత అయ్యారు.
  • 2012 : 2012 మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్ తౌబాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓయినం ఇందిరాపై 19,121 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలుపొందారు.
  • 2007 : 2007 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్ మ‌రోసారి ఖాంగ‌బోక్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న లైశ్రామ్ సింగ్ జాత్రాపై 16,782 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీటితోపాటు ఆయ‌న తౌబాల్ నుంచి కూడా పోటీ చేసి, త‌న ప్ర‌త్య‌ర్థి లైతాంతేమ్ తోంబా సింగ్‌ను 17,393 ఓట్ల తేడాతో ఓడించారు.
  • 2002 : 2002 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్, ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. త‌న చిరకాల ప్ర‌త్య‌ర్థి లైశ్రామ్ జాత్రా సింగ్‌ను 12,897 ఓట్ల తేడాతో ఓడించారు.
  • 2002-2017 : మణిపూర్ రాష్ట్రానికి ఓక్రామ్ ఇబోబీ సింగ్ 19వ ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.
  • 2000 : 2000 లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్ మ‌ళ్లీ ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఆయ‌న లైశ్రామ్ జాత్రా సింగ్ చేతిలో 11,144 ఓట్ల తేడాతో ఓట‌మి చ‌విచూశారు.
  • 1995 : 1995 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గ బ‌రిలో నిలిచారు. ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి లైశ్రామ్ జాత్రా సింగ్ చేతిలో 8021 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • 1990 : 1990 లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓక్రామ్ ఇబోబీ సింగ్ మ‌రోసారి ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. ఈసారీ ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి ఎం. బోరోజావో పై 7320 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలుపొందారు.
  • 1984 : 1984 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఖాంగ‌బోక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎం. బోరోజావోపై 4157 ఓట్ల తేడాతో గెలిచారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+