వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదు.. వైఎస్ జగన్ పై ఆ వ్యాఖ్యల దుమారం!!

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, ఆ పై టిడిపి నేతలపై కేసులు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల లో ఈనెల 18వ తేదీన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజమండ్రి ఎంపీ భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీరియస్ అయ్యారు.

ఉద్యోగాల క‌ల్ప‌న నామినేటెడ్ పదవులిచ్చినంత ఈజీ కాదు; తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్: లోకేష్ఉద్యోగాల క‌ల్ప‌న నామినేటెడ్ పదవులిచ్చినంత ఈజీ కాదు; తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్: లోకేష్

 సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలను రగిలించేలా మాట్లాడారని ఆయనపై నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అయ్యన్నపాత్రుడు పై 153ఏ, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

గతంలోనూ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

గతంలోనూ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు


గతంలోనూగుంటూరు జిల్లాలో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభ అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది రాష్ట్ర హోమ్ మంత్రి సుచరిత అయ్యన్నపాత్రుడు దూషించడం టూ న్యాయవాది వేముల ప్రసాద్ ఫిర్యాదు చేయగా, అప్పట్లో అయ్యన్నపాత్రుడు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

 మూడేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని జగన్ పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు

మూడేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని జగన్ పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ను అసభ్య పదజాలంతో దూషించారన్న కారణంగా వైసీపీ నేతలు అయ్యన్నపాత్రుడు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

 కక్ష సాధింపు అంటూ టీడీపీ నేతల ఆగ్రహం

కక్ష సాధింపు అంటూ టీడీపీ నేతల ఆగ్రహం


అయితే టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెట్టారని జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో టిడిపి భారీ బైక్ ర్యాలీ చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వారు మండిపడ్డారు.

Recommended Video

Akula Satyanarayana And Judpudi Prabhakar Joined In YCPCP ! || వైసీపీ లో చేరిన ముఖ్య నేతలు !
టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినా కేసులు నమోదు చెయ్యలేదని ఆగ్రహం

టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినా కేసులు నమోదు చెయ్యలేదని ఆగ్రహం


ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో ర్యాలీ జరిగిన రోజున టిడిపి ఎస్సీ నాయకుడు సుబ్బారావు పై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్న టిడిపి నేతలు ఆరోజు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. మరోమారు ముప్పిడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

English summary
Police have registered a case against former minister Chintakayala Ayyannapatrudu. The case was registered after he complained that he had made indecent remarks on CM Jagan at the NTR Statue inauguration in nallajarla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X