ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అంపశయ్య మీద ఉన్న పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు.

జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సైతం రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగలేనని భీష్మించుకుని కూర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు బతిమిలాడుతున్న కనీసం కనికరించడం లేదు. గాంధీ-నెహ్రూ కుటుంబాలు కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు. రాహుల్ గాంధీని రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని సీడబ్ల్యూసీ కోరుతున్నా ఆయన మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ రాజీనామా ఆమోదమైతే దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు మాజీలు అవుతారు.

నోటా కన్నా తక్కువ ఓట్లు .. దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి
ఏపీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, పరిస్థితి మరింత దిగజారిపోయింది. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి.కాంగ్రెసుకు మాత్రం 1.29 శాతం ఓట్లు వచ్చాయి.రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా, కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ కన్నా నోటా బెటర్ అన్న భావన ఏపీలో ఉంది అని అర్ధం అవుతుంది.

నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన రఘువీరా రెడ్డి
ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లోకసభ, శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు 2.8 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అంత కంటే తక్కువ వచ్చాయి . దీంతో కాంగ్రెసు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ రఘువీర రాజీనామా చేశారు. రఘువీరారెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications