విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబ్ తుఫాను ఎఫెక్ట్ .. ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం ; ప్రమాద స్థాయిలో జలాశయాలు, స్తంభించిన జనజీవనం

|
Google Oneindia TeluguNews

గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. గులాబ్ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గులాబ్ తుఫాను తీరం దాటిన సమయంలో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటిన తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం గులాబ్ తుఫాను ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో అల్పపీడనం 28వ తేదీన ఏర్పడే ప్రమాదం ఉందని, అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరందాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తుంది.

Recommended Video

Gulab Cyclone : రానున్న మరో అల్పపీడనం.. ప్రమాద స్థాయిలో జలాశయాలు..! || Oneindia Telugu

వైఎస్సార్ లానే జగన్.. రాయలసీమకు అన్యాయం; దమ్ముంటే కేసీఆర్ ఇంటిని ముట్టడించాలని టీడీపీ సవాల్వైఎస్సార్ లానే జగన్.. రాయలసీమకు అన్యాయం; దమ్ముంటే కేసీఆర్ ఇంటిని ముట్టడించాలని టీడీపీ సవాల్

 శ్రీకాకుళంలో వర్ష బీభత్సం .. విద్యుత్ సరఫరాకు అంతరాయం

శ్రీకాకుళంలో వర్ష బీభత్సం .. విద్యుత్ సరఫరాకు అంతరాయం

శ్రీకాకుళం జిల్లా పై తుఫాను ప్రభావం కొనసాగుతోంది. శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టాయి.

30 చోట్ల పునరావాస కేంద్రాలు .. అక్కునపల్లి బీచ్ లో పడవ బోల్తా

30 చోట్ల పునరావాస కేంద్రాలు .. అక్కునపల్లి బీచ్ లో పడవ బోల్తా


సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ బృందాలు రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయి. గులాబ్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 30 ప్రదేశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటికి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అక్కునపల్లి బీచ్ లో ఒక పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయారు. మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు.

విశాఖ జిల్లాలో వర్ష బీభత్సం .. ప్రమాద స్థాయిలో జలాశయాలు .. తాజా పరిస్థితి ఇలా

విశాఖ జిల్లాలో వర్ష బీభత్సం .. ప్రమాద స్థాయిలో జలాశయాలు .. తాజా పరిస్థితి ఇలా

ఇక విశాఖ జిల్లాలోనూ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల విశాఖపట్నం జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు మీదకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో పలు జలాశయాలలో ప్రమాదస్థాయికి నీటి మట్టం చేరుకుంది. మాడుగుల నియోజకవర్గం లో ఏడు జలాశయాలలో భారీగా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మండలంలోని పెద్దేరు జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు వెయ్యి క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.

తుఫాన్ ప్రభావం .. అరకులోయకు రాకపోకలు బంద్

చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కళ్యాణ లోవ జలాశయం కూడా ప్రమాదస్థాయికి చేరుకుంది. అక్కడ నాలుగు గేట్లు ఎత్తి 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తాచేరు, గొర్రి గెడ్డ , ఉరకగెడ్డ, పాల గెడ్డ జలాశయాలు కూడా నిండుకున్నాయి. ఇదిలా ఉంటే గులాబ్ తుఫాను ప్రభావంతో అరకులోయ, అనంతగిరి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అరకు లోయ ఘాట్రోడ్డులో పలు ప్రాంతాలలో ప్రధాన రహదారిలో అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు, చంపావతి ఉధృతి , గ్రామాల్లో వరదనీరు

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు, చంపావతి ఉధృతి , గ్రామాల్లో వరదనీరు

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాను ప్రభావం వల్ల మన్యంలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇప్పటికే పలు చెరువులకు గండ్లు పడ్డాయి పూసపాటిరేగ, భోగాపురం పరిధిలో సముద్రంలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు విజయనగరం రైల్వే ట్రాక్ పై భారీగా వరద నీరు చేరుకుంది. విజయనగరం రాజాం రహదారిపై చెట్లు నేలకూలాయి. చంపావతి నది ఉధృతితో గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంటుంది.

 తూర్పు గోదారి , పశ్చిమ గోదావరి జిల్లాలలో వర్ష బీభత్సం

తూర్పు గోదారి , పశ్చిమ గోదావరి జిల్లాలలో వర్ష బీభత్సం

ఇక గులాబ్ తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా పై కనిపిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం గా మారుతుంది. నర్సాపురం, భీమవరం, ఏలూరు, తణుకు ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గులాబ్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా పై కూడా పడింది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. ప్రాణనష్టం జరగకుండా ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం శ్రీకాకుళం జిల్లా పైనే

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అత్యధికంగా దెబ్బతింది. ముఖ్యంగా సిక్కోలు జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. కళింగపట్నంలో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తుఫాను పరిస్థితి పై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గులాబి ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో విపత్తు సహాయ దళాలు మోహరించి సహాయక చర్యలను అందిస్తున్నాయి. అధికారులకు ఈ మేరకు సెలవులు రద్దు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని, అందిస్తున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

English summary
Uttarandhra trembling with the impact of Cycolne Gulab. In Uttarandhra region Visakhapatnam, Vizianagaram, Srikakulam and East Godavari, West godavari districts suffering with heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X