• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ నా ప్రధాన ఫైనాన్షియర్ .. 50 కోట్లు ఇచ్చారని షాక్ ఇచ్చిన ఆర్జీవీ

|

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్నటికి నిన్న రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి చెన్నై లో ఉంటె ఏంటి అని వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి ? చెన్నైలో ఉంటే ఏంటి ? అంటున్న ఆర్జీవీ

 జగన్ ,దావూద్ ఇబ్రహీంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

జగన్ ,దావూద్ ఇబ్రహీంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

జగన్, దావూద్ లు తనకు ప్రధానమైన ఫైనాన్షియర్స్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాం గోపాల్ వర్మ . ఏదో ఒక రకంగా వైఎస్ జగన్ నాకు ఓ రూ. 50 కోట్లు ఇచ్చారు. మరో గుర్తు తెలియని వ్యక్తి 30 కోట్లు ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం మరో 15 కోట్లు ఇచ్చాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తానిప్పుడు ఫిల్మ్ మేకర్ అవతారంలో ఉన్నానని ఆయన చెప్పుకున్నారు.ఆ సమయంలో ఏ మూడ్ వస్తే, ఆ పని చేస్తుంటానని అన్నారు వర్మ .

 కేఏ పాల్ పై తాను పరువునష్టం దావా వెయ్యొచ్చన్న వర్మ

కేఏ పాల్ పై తాను పరువునష్టం దావా వెయ్యొచ్చన్న వర్మ

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై కూడా అయన తనదైన శైలిలో స్పందించారు . ఆచిత్రం వల్ల తానేమీ నష్టపోలేదని ఆయన పేర్కొన్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా గురించి తాను ఏమి చెప్పినా, మీరు ఏమనుకోవాలో అదే అనుకుంటారని చెప్పుకొచ్చారు వర్మ . తాను నిర్మొహమాటంగా మాట్లాడుతానని పేర్కొన్న ఆయన కావాలనుకుంటే కేఏ పాల్ పై తానుకూడా పరువు నష్టం దావా వేస్తానని వర్మ చెప్పారు. తన తాజా చిత్రం ఓ సెటైరికల్ చిత్రమని, అందులో ఏ విధమైన బ్లేమ్ లేదని, ఎవరినీ కించపరిచేది కాదని చెప్పుకొచ్చారు. కేఏ పాల్ ను విమర్శిద్దామంటే అతనికి క్యారెక్టర్ కూడా లేదని వర్మ విమర్శలు గుప్పించారు.

జగన్, దావూద్ ప్రధాన ఫైనాన్షియర్ లు కాబట్టే చేస్తున్నా అన్న వర్మ

జగన్, దావూద్ ప్రధాన ఫైనాన్షియర్ లు కాబట్టే చేస్తున్నా అన్న వర్మ

తనకు సినిమాల్లో నటించాలన్న ఉద్దేశం ఏ మాత్రం లేదని, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాను అనౌన్స్ చేసిన సినిమాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. తన వద్ద మూడు సినిమాలు, మూడు వెబ్ సీరీస్ లు నిర్మాణంలో ఉన్నాయని, నయీమ్, శశికళలపై తీయదలచుకున్న సినిమాలు తప్పకుండా బయటకు వస్తాయని చెప్పారు. ఇక జగన్, తనకు ప్రధాన ఫైనాన్షియర్ కాబట్టే ఇవన్నీ చెయ్యగలుగుతున్నా అంటూ ఆయన సెటైర్లు వేశారు.

వర్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏమంటుందో ?

వర్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏమంటుందో ?

ఒకపక్క టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ గా చేసుకుని అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని సెటైరికల్ సినిమా తీసిన ఆర్జీవీ చంద్రబాబు పేరు చెప్తేనే మండిపడతారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన వ్యంగ్యంగా అన్న మాటలను టీడీపీ నేతలు ఎలా తీసుకుంటారో, వైసీపీ అధినేత జగన్ కు, ఆర్జీవీకి మధ్య ఆర్ధిక లావాదేవాలున్నాయని చెప్పి స్వయంగా ఆర్జీవీనే చెప్పారని రచ్చ చేస్తారో వేచి చూడాలి .

English summary
Ram Gopal Varma has made interesting comments that Jagan and Davud are his main financiers. Somehow YS Jagan gave me Rs. 50 crores. Another unidentified person gave 30 crores. He also said that Davud Ibrahim paid another 15 crores. He said he was in the filmmaker's incarnation and he will do according to his mood .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X