మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలా.. సకలశాఖల మంత్రి సజ్జల: ధ్వజమెత్తిన నారా లోకేష్
వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన మండిపడుతున్నారు. పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, పెరుగుతున్నాయని, అయినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని నిప్పులు చెరిగారు నారా లోకేష్. తాజాగా సత్యసాయి జిల్లాలో ఒక మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఘటనపై ఆయన తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇక ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా టార్గెట్ చేశారు నారా లోకేష్.

హిందూపురం మహిళపై అత్యాచార ఘటన.. మండిపడిన లోకేష్
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపూర్ మండలం లోని ఒక గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్ళు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అత్యాచారం కేసు నమోదు చేయకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. స్థానిక వైసీపీ నేతలు ఒత్తిడితో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని నారా లోకేష్ నిప్పులు చెరిగారు

సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ టార్గెట్ చేసిన లోకేష్
మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని పేర్కొన్నారు లోకేష్. ఇక మహిళలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని, సజ్జల రామకృష్ణ రెడ్డి ని సైతం టార్గెట్ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అక్కులప్ప, అఖిల్, వారికి సహకరిస్తున్న స్థానిక వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Recommended Video


తనపై అత్యాచారం జరిగిందని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
ఇదిలా ఉంటే తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేవలం చిన్నపాటి తగాదా కేసును నమోదు చేసి తనకు అన్యాయం చేశారని బాధితురాలు సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. సోమవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించక పోవడం వల్ల, తనపై వారి మరోమారు భౌతిక దాడికి దిగి, అత్యాచారం చేశారని, తనకు న్యాయం చేయని పక్షంలో తాను ఆత్మహత్యకు పాల్పడతాను అంటూ బాధిత మహిళ బాధితుల ముందు లబోదిబోమన్నారు .












Click it and Unblock the Notifications