ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు!
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కైరుప్పల గ్రామంలో ప్రతి సంవత్సరం పిడకల సమరం చాలా ఘనంగా జరుగుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిడకల సమరం భక్తులకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత రోజు ఈ పిడకల సమరాన్ని భక్తులు జరుపుకుంటారు. భద్రకాళి దేవి, వీరభద్రస్వామి పండుగ సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకుంటూ తమ భక్తిని చాటుకుంటారు.
రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం
గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటూ సమరం చేస్తారు. ఒక వర్గం స్వామివారి తరపున, మరొక వర్గం అమ్మవారి తరపున పోరాటం చేస్తారు. పోరాటంలో గాయాలైన వారు ఆ గాయాలకు స్వామివారి విభూదిని రాసుకుంటారు. మూడు రోజుల్లో ఆ గాయం నయం అవుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ సంవత్సరం కూడా పిడకల సమరం అత్యంత ఘనంగా జరిగింది.

పిడకల సమరంలో 36 మందికి స్వల్ప గాయాలు
దాదాపు అరగంట పాటు హోరాహోరీగా గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. ఈ పిడకల సమరంలో 36 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వేడుకను తిలకించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గ్రామంలో వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పిడకల సమరం తర్వాత, గ్రామ పెద్దలు పంచాయితీ చేసి వీరభద్ర స్వామికి, భద్రకాళి అమ్మవారికి కళ్యాణం ఘనంగా జరిపిస్తారు.
వీరభద్రస్వామి, భద్రకాళీ దేవి ప్రేమ కథ
అయితే అనాదిగా వస్తున్న ఈ అనవాయితీ వెనుక ఒక ఆసక్తికర ప్రేమ కథ ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులు. వీరభద్ర స్వామి పెళ్లిని ఆలస్యం చేయడంతో వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. తమ దేవతను మోసం చేశాడని భావించిన అమ్మవారి భక్తులు, వీరభద్ర స్వామిని పిడకలతో కొట్టి అవమానించాలని నిశ్చయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న వీరభద్ర స్వామి భక్తులు, ఆయనను అమ్మవారి ఆలయం వైపు వెళ్లవద్దని వేడుకున్నారు.
గ్రామ మంచి కోసం, వీరభద్ర స్వామి కరుణ కోసం పిడకల దాడి
అయినప్పటికీ, స్వామివారు ఆలయం వైపు వెళ్లగా, అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా ఆయనపై పిడకలతో దాడి చేశారు. దాంతో స్వామి వారి తరపున భక్తులు ప్రతి దాడి చేశారు. ఆపై ఇరువర్గాల వారు శాంతించి, పంచాయతీ చేసి పెళ్లి జరిపించారని ఈ పురాణం ఈ వినూత్న ఆచారం యొక్క మూలాలను వివరిస్తుంది. అప్పటినుంచి ఇప్పటివరకు గ్రామస్తులు గ్రామ మంచి కోసం వీరభద్ర స్వామి కరుణ కోసం ఈ పిడకల సమరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!













Click it and Unblock the Notifications