Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉప్పూ,నిప్పుగా వ్యవహరించి, ఎక్స్ లో రోజూ ట్వీట్ల వార్ చేసుకున్న రఘురామకృష్ణంరాజు(raghurama krishanam raju), విజయసాయిరెడ్డి (vijayasai reddy)ఇప్పుడు మంచి మిత్రులుగా మారిపోయారట. అంతే కాదు విజయసాయిరెడ్డి ఇంట్లోనే రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం కుటుంబంతో కలిసి నివసిస్తున్నారట. ఈ సంచలన విషయాల్ని రఘురామకృష్ణంరాజు తాజాగా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వూలోనే వెల్లడించారు.

జగన్ పై ఆమె రెచ్చిపోతుంటే చీమ కుట్టలేదా ? వైసీపీకి సాయిరెడ్డి ప్రశ్న..!
జగన్ పై ఆమె రెచ్చిపోతుంటే చీమ కుట్టలేదా ? వైసీపీకి సాయిరెడ్డి ప్రశ్న..!

విజయసాయిరెడ్డికీ, తనకూ మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఆయనతో తనకు విభేదాలు లేవని, స్నేహం ఉందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే తమ మధ్య స్నేహం చిగురించినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఓ 50 ఇళ్లు ఉన్నాయని, అక్కడే విజయసాయిరెడ్డి ఇల్లు కూడా ఉందన్నారు. అయితే ఈ మధ్య వైసీపీలో లేకపోవడంతో ఇక్కడికి రావడం తగ్గించారన్నారు.

Raghurama Krishnam Raju Stays in Vijayasai Reddy s House Amidst Bitter Feud in past
రఘురామ కేసులో కీలక పరిణామం:సునీల్ నాయక్ కు మరో రిలీఫ్..!
రఘురామ కేసులో కీలక పరిణామం:సునీల్ నాయక్ కు మరో రిలీఫ్..!

తాను ఆ ప్రాంతంలో ఇంటి కోసం సినీ నిర్మాత ఆదిశేషగిరిరావును సంప్రదిస్తే.. విజయసాయిరెడ్డి ఇల్లు ఉందని, అభ్యంతరం ఉందా అని అడిగితే లేదని చెప్పినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు కాకుండా అద్దె ఇచ్చే ఉంటాను కాబట్టి అందులోకి వెళ్లేందుకు ఇష్టపడినట్లు వెల్లడించారు. గతంలో విజయసాయిరెడ్డికీ, తనకూ మధ్య ట్వీట్ వార్ నడిచిన మాట వాస్తవమేనని, అయితే ఆ ట్వీట్లు ఆయన పెట్టలేదని, జగన్ దగ్గర ఉన్న ఓ వ్యక్తి వీటిని పెట్టేవాడన్నారు.

Raghurama Krishnam Raju Stays in Vijayasai Reddy s House Amidst Bitter Feud in past
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..!
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..!

సాయిరెడ్డి వల్గర్ గా ట్వీట్లు పెట్టే వ్యక్తి కాదని, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన ఆయన అంత కుసంస్కారి కాదన్నారు. అప్పట్లో ఆయన పెట్టే ట్వీట్లు వాస్తవానికి ఆయన పెట్టేవి కాదని తెలిసీ తాను కూడా బహిరంగంగానే కౌంటర్లు పెట్టే వారన్నారు. జగన్ విషయంలోనూ తనకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయన్ను తాను అసెంబ్లీలోనే పలకరించి భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు రఘురామ గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+