వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే... అధికారుల కసరత్తు; ఏపీలో కొత్త జోనల్ వ్యవస్థ ఇలా!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జోనల్ వ్యవస్థ పై, ఉన్నత విద్యాసంస్థల పరిధిపై కూడా ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలో నాలుగు జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా ఈ నాలుగు జోన్ లు మాత్రమే ఉంటాయి. 26 జిల్లాలను అదే క్రమంలో విభజన చేస్తారు.

Recommended Video

AP New Districts Complete Details 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు,నియోజకవర్గాలు | Oneindia Telugu
ఒక్కో జోన్ పరిధిలో ఐదు నుండి ఏడు జిల్లాలు

ఒక్కో జోన్ పరిధిలో ఐదు నుండి ఏడు జిల్లాలు


ఇదివరకే ఉన్న జోన్ల పరిధిలోకి కొత్త జిల్లాలు అదనంగా వచ్చి చేరుతాయి తప్ప కొత్త జోన్ల ఏర్పాటు జరగదు. ఇదిలా ఉంటే ఒక్కో జోన్ పరిధిలో ఐదు నుంచి ఏడు జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. మల్టీ జోన్ పరిధిలోని జోన్ 1లో శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉంటాయని తెలుస్తోంది. జోన్ 2లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉంటాయని సమాచారం.

శ్రీ బాలాజీ జిల్లా ఏ జోన్ లో .. అధికారుల కసరత్తు

శ్రీ బాలాజీ జిల్లా ఏ జోన్ లో .. అధికారుల కసరత్తు

మల్టీ జోన్ 2 పరిధిలోని జోన్ 3లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉండనున్నట్లు సమాచారం. జోన్ 4 లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించినట్లుగా సమాచారం. కొత్తగా ఏర్పడుతున్న శ్రీ బాలాజీ జిల్లాలో 17 మండలాలు నెల్లూరులో అంటే జోన్ 3 లో, 18 మండలాలు చిత్తూరులో జోన్ 4 లో ఉండడంతో బాలాజీ జిల్లాను ఏ జోన్ లో ఉంచాలన్న విషయంపై కసరత్తు సాగుతోంది.

రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఏయూ, ఎస్వీయూ పరిధిలో

రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఏయూ, ఎస్వీయూ పరిధిలో


జూనియర్ అసిస్టెంట్ తదితర సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోని ఉండటంతో వారు పూర్తిగా జోనల్ వ్యవస్థ లోకి వస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ వరకు జోనల్ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్ ఆపై కేడర్ ఉద్యోగులంతా మల్టీ జోన్ పరిధిలోకి వస్తారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు దాదాపు ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి.

జిల్లాల పునర్విభజన తర్వాత ఏయూ, ఎస్వీయూ పరిధిపై ప్రతిపాదనలు.. అధికారుల కసరత్తు

జిల్లాల పునర్విభజన తర్వాత ఏయూ, ఎస్వీయూ పరిధిపై ప్రతిపాదనలు.. అధికారుల కసరత్తు

జిల్లాల పునర్విభజన తరువాత ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు జిల్లాలను ప్రతిపాదించారు. ఇక ఎస్ వి యూనివర్సిటీ రీజియన్లో చిత్తూరు, శ్రీ బాలాజీ, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్ కడప జిల్లా లు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ఆంధ్ర యూనివర్సిటీ రిజల్ట్ పరిధిలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదు మండలాలు, నెల్లూరు జిల్లా పరిధిలోని 30 మండలాలు ఎస్వీ రీజియన్ పరిధిలో ఉండటంతో దీనిని ఏ రీజియన్ పరిధిలో చేర్చాలని అంశంపై కసరత్తు సాగుతోంది.

English summary
The government is preparing to formation of new districts from Ugadi. As the number of districts increases, number of zones will be the same. The government is working on a new zonal system in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X