బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: తక్కువ కులందానా, స్నానం చెయ్యకుండా గుడికి వస్తావా ?, జుట్టుపట్టి ఈడ్చేసి ?, సీసీటీవీల్లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని ఓ గుడికి ఓ వివాహిత మహిళ వెళ్లింది. తరువాత గుడిలో పూజారికి ఆమెకు వాగ్వివాదం జరిగింది. తనను కులం పేరుతో దూషించారని, స్నానం చెయ్యకుండా ధరిధ్రం మొత్తం తల మీద పెట్టుకుని గుడిలోకి వస్తావా అంటూ దేవాలయం నిర్వహకుడు తన జుట్టు పట్టుకుని గుడిలో నుంచి ఈడ్చుకుంటూ వచ్చి బయటకు లాగేశాడని, తన మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ ఆయన మీద కేసు పెట్టింది.

తాను వెంకటేశ్వరస్వామి భార్య పధ్మావతిదేవి అని, తనకు మీరు పూజలు చెయ్యాలని ఆమె గర్బగుడిలో దేవుడి పక్కన కుర్చోవడానికి ప్రయత్నించడంతో ఆమెను గుడిలో నుంచి బయటకు లాగేశామని దేవాలయం పరిపాలన విభాగం సభ్యుడు, పూజారి అంటున్నారు. గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగారు.

Reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన హ్యాకర్లు, అకౌంట్స్ హ్యాక్, నూరు జన్మలెత్తినా ఏం చెయ్యలేరు. గాలి!Reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన హ్యాకర్లు, అకౌంట్స్ హ్యాక్, నూరు జన్మలెత్తినా ఏం చెయ్యలేరు. గాలి!

బెంగళూరులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం

బెంగళూరులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం

బెంగళూరు నగరంలోని అమృతహళ్లిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి అమృతల్లి లోనిమునిగురప్ప లేఅవుట్‌ లోనివాసం ఉంటున్న హేమావతి(32) అనే మహిళ డిసెంబర్ 21వ తేదీన ఉదయం 9.30 గంటటల సమయంలో వెళ్లింది.

ఆ సందర్బంలో గుడిలో తన మీద దాడి జరిగిందని హేమావతి పోలీసులను ఆశ్రయించింది. గుడి ధర్మకర్తల మండలి సభ్యుడు మునికృష్ణప్ప తన మీద దాడి చేశాడని హేమావతి కేసు పెట్టడంతో అతని మీద అమృతల్లి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మహిళ వాదన ఇదే

మహిళ వాదన ఇదే

డిసెంబర్ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి తాను వెళ్లినప్పుడు మునికృష్ణప్ప నాతో అసభ్యంగా ప్రవర్తించాడని, నువ్వు తక్కువ కులానికి చెందినవారు, స్నానం చెయ్యకుండా, శుభ్రంగా లేకుండా గుడికి వస్తావా? నేను నిన్ను ఇక్కడ దేవుణ్ణి చూడనివ్వను అంటూ తనను అనరాని మాటలతో దూషించాడని హేమావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జుట్టుపట్టుకుని బయటకు లాగేశారు

జుట్టుపట్టుకుని బయటకు లాగేశారు

ఆ సందర్బంలో తాను ఎదురుతిరిగానని, నాపై విచక్షణా రహితంగా దాడి చేసి, నా జుట్టు పట్టుకుని గుడిలో నుంచి బయటకు ఈడ్చుకెళ్లారని హేమావతి ఆరోపించింది. ఆ సమయంలో పూజారులు వచ్చి విడిపించడానికి ప్రయత్నించినా మునికృష్ణప్ప నన్ను వదల్లేదని, సమీపంలో ఉన్న ఇనుప రాడ్‌తో తీసుకుని ఆలయం ఆవరణంలో తనను కొట్టి ఆలయం బయటకు ఈడ్చేశారని ఆరోపిస్తూ హేమావతి పోలీసు కేసు పెట్టింది.

చంపేస్తామని బెదిరించాడు

చంపేస్తామని బెదిరించాడు

గుడిలో దాడి జరిగిన విషయం నీ భర్తకు కానీ, మరెవరికైనా చెబితే నిన్ను, నీ భర్తను ఇదే ఏరియాలో చంపేస్తానని మునికృష్ణప్ప తనను బెదిరించాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హేమావతి ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు అన్నారు. పోలీసులు గుడిలో, గుడి బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

సీసీటీవీ కెమెరాల్లో క్లారిటీ

సీసీటీవీ కెమెరాల్లో హేమావతి మీద మునిక్రిష్ణప్ప దాడి చేసినట్లు స్పష్టంగా కనపడుతోందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. మునిక్రిష్ణప్పను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు, ఆ సందర్బంలో అనారోగ్యానికి గురైన మునిక్రిష్ణప్ప ఆసుపత్రిలో చేరారని, ఆసుపత్రి వైద్యులతో చర్చించిన తరువాత అతన్ని మరోసారి విచారణ చేస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

దేవుడి భార్య అని హంగామా చేసింది

దేవుడి భార్య అని హంగామా చేసింది

దాడికి గురైన హేమావతి డిసెంబర్ 21వ తేదీన ఆలయానికి వచ్చి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నంచిందని, ఆ సందర్బంలో ఆమెను అడ్డుకున్న పూజారులు ఆమెను గర్బగుడిలోకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించారని మునిక్రిష్ణ అంటున్నాడు.

నేను వెంకటేశ్వర స్వామి భార్య పధ్మావతి దేవిని. నేను గర్బగుడిలో వెంకటేశ్వరుడి విగ్రహం పక్కన కూర్చోవాలి అని హేమావతి నానా హంగామా చేసిందని, దీనిపై అర్చకులు వ్యతిరేకత వ్యక్తం చేశారని పోలీసులు అన్నారు.

అందుకే బయటకు ఈడ్చేశాము

అందుకే బయటకు ఈడ్చేశాము

ఆ సమయంలో కోపోద్రిక్తురాలైన హేమావతి పూజారి ముఖంపై ఉమ్మివేసి దుర్భాషలాడిందని, ఈ సందర్భంగా ఆలయం పరిపాలన విభాగం సభ్యుడు మునికృష్ణప్ప అక్కడికి వచ్చి ఆ మహిళను ప్రశ్నించగా అతని ముఖం మీద కూడా ఆమె ఉమ్మేసిందని కొందరు అంటున్నారు, ఆ సమయంలో కోపోద్రిక్తుడైన మునికృష్ణప్ప రెచ్చిపోతున్న హేమావతి మీద దాడి చేసి గుడిలో నుంచి బయటకు లాగేశారని పూజార్లు చెబుతున్నారని పోలీసులు అన్నారు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్

గుడిలో ఓ వ్యక్తి మహిళ జుట్టు పట్టుకుని బయటకు లాగేస్తున్న సమయంలో అదే గుడిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐటీ హబ్ బెంగళూరులోనే ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపింది. సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

English summary
He grabbed a group of women from the temple and dragged them out in Bengauru, CCTV clippings went viral on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X