బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Anti Hindu: నేను హిందూ వ్యతిరేకి కాదు మహాప్రభో, సీఎంను కుక్క పిల్లతో పోల్చి ఇప్పుడు?, సిద్దూ క్లారిటి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హుబ్బళి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం సిద్దరామయ్యను హిందూ వ్యతిరేకిగా బీజేపీ నాయకులు చిత్రీకరిస్తున్నారు. ఇదే సందర్బంలో నేను హిందూ వ్యతిరేకి కాదు మహాప్రభో అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అయోధ్యలో రామమందిరం నిర్మించడాన్ని తాను వ్యతిరేకించలేదని, అయితే రామమందిరాన్ని రాజకీయం చెయ్యడాన్ని వ్యతిరేకిస్తున్నానని సిద్దరామయ్య అన్నారు, బీజేపీ వాళ్లేనా గుడులు గోపురాలు కట్టేది, మేము రాముడు, ఆంజనేయుడి దేవాలయాలు గ్రామాల్లో కట్టలేదా ? అని సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని కుక్కపిల్ల అని సంబోధంచిన విషయంలో కూడా మాజీ సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు.

girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా?!girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా?!

అయోధ్యలో రామమందిరం

అయోధ్యలో రామమందిరం

అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రామమందిరాన్ని రాజకీయంగా వాడుకోకూడదు. నేను హిందూ వ్యతిరేకిని కాదు అని కర్ణాటక మాజీ సీఎం , ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. హుబ్బళిలోని ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడిన మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు.

మతాలు, కులాలతో రాజకీయం చేస్తారా?

మతాలు, కులాలతో రాజకీయం చేస్తారా?

మరో మతాన్ని వ్యతిరేకించేందుకు రాజకీయం చెయ్యకూడదని, రాజకీయం కోసం మతాలనుగా ఉపయోగించకూడదనేదే మా అభ్యంతరం. ప్రతి గ్రామంలో రాముడి గుడులు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఏం వాటికి మా ప్రభుత్వాలు కట్లలేదా, మా నాయకులు గుడులు, గోపురాలు నిర్మించలేదా, రాజకీయం కోసం కులాలు, మతాలు అడ్డుపెట్టుకోవడం మంచిదికాది మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.

నేను హిందూ వ్యతిరేకి కాదు మహాప్రభో

నేను హిందూ వ్యతిరేకి కాదు మహాప్రభో

మతతత్వం ఉన్న ఏ పార్టీ కూడా ప్రజలను పాలించడం తగదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని సిద్దరామయ్య అన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సహా అన్ని మతాలు సమానమే. మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నేను హిందూ వ్యతిరేకిని కాదు మహాప్రభో అంటూ సిద్దరామయ్య మరోసారి చెప్పారు.

స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏం చేసింది?

స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏం చేసింది?

స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ నేతలెవరూ పాల్గొనలేదని సిద్దరామయ్య అన్నారు. 1925 నుంచి 1947 వరకు భారతదేశంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు కాని, హిందూ మహాసభ నాయకులు కాని పాల్గొనలేదని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఆ సమయంలో స్వాతంత్ర్య పోరాటం తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు, కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా?, ఉంటే వాళ్లు ఎవరో చెప్పండి అని మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

సీఎంను కుక్కపిల్లతో పోల్చి ఇప్పుడు మాత్రం?

సీఎంను కుక్కపిల్లతో పోల్చి ఇప్పుడు మాత్రం?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మాయ్ ని అవమానించాలనే ఉద్దేశంతో తాను నాయి మరి ( కుక్కపిల్ల) అని అనలేదని సిద్దరామయ్య వివరణ ఇచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ధైర్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి నిధులు మంజూరు చేయమని అడగాలని తాను పల్లె భాషలో నాయి మరి (కుక్క పిల్ల) అని చెప్పానని సిద్దరామయ్య వివరణ ఇచ్చుకున్నారు.

యుడియూరప్ప రాజాపులి

యుడియూరప్ప రాజాపులి

గతంలో నేను మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పను రాజాహులీ (రాజా పులి) అని పిలిచాను, నన్ను టైగర్ అని పిలుస్తారు. అవునా పులి ( హోదా హలి) అని ప్రజలు పిలుస్తారు, దానిని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాము ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. గతంలో సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే బీజేపీ కార్యకర్తలు ఎగతాలిగా హోదా హులి (అవునా పులి) అని గేలి చేశారు.

సీఎంకు లేదా మంత్రికి లంచం ఇవ్వడానికి వెళ్లారా?

సీఎంకు లేదా మంత్రికి లంచం ఇవ్వడానికి వెళ్లారా?

విధానసౌడలో దొరికిన 10 లక్షల డబ్బు గురించి మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఓ ఇంజనీర్ విధాన సౌధకు డబ్బులు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. సీఎంకు లేదా ఎవరైనా మంత్రికి లంచం ఇవ్వడానికి ఆ ఇంజనీరు వెళ్లి ఉండవచ్చని సిద్దరామయ్య ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

English summary
I am not anti-Hindu, Swami, you are misunderstanding, I spoke in the village language that the CM is a puppy, says Karnataka former CM Siddaramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X