బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Violence: బాగల్ కోటే అల్లర్లు, హిందూ, ముస్లీంల శాంతిచర్చలు, 4 కేసులు, 18 మంది అందర్, నుపూర్ ఎఫెక్ట్!

|
Google Oneindia TeluguNews

బాగల్ కోటే/బెంగళూరు: బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని ఓ టీ దుకాణం ముందు రెండు వర్గాల మద్య జరిగిన గొడవల కారణంగా నలుగురి మీద కత్తులతో దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మద్య గొడవలు జరగడం, ఇరు వర్గాలు దాడులకు దిగడంతో బైక్ లు, షాపులు, కూరగాయల బండ్లకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రెండు వర్గాల మద్య గొడవలు జరగడంతో నాలుగు కేసులు నమోదు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నామని బాగల్ కోటే జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు. రెండు వర్గాల మద్య గొడవలు జరగడానికి కొందరు ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి మండిపడుతున్నారు.

Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది!Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది!

హిందూ యువకులపై కత్తులతో దాడి

హిందూ యువకులపై కత్తులతో దాడి

నుపూర్ శర్మా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బాదామి తాలుకాలోని కేరూరు పట్టణంలో రెండు వర్గాల మద్య గొడవలు జరిగాయి. హిందూ జాగరణ వేదిక బాగల్ కోటే జిల్లా కార్యదర్శి అరుణ్ కట్టమని, ఆయన సోదరుడు లక్ష్మణ్ కట్టిమని, యమనూర్ చుంగితో పాటు మరో వ్యక్తి మీద మరో వర్గానికి చెందిన యువకులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేశారు.

రగిలిపోయిన ఊరు

రగిలిపోయిన ఊరు

ఇరు వర్గాలు దాడులకు దిగడంతో కేరూరులో 5 బైక్ లు, 10 షాపులు, ఆ ప్రాంతంలోని కూరగాయల బండ్లుకు, చిన్నచిన్న షాపులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకిదిగారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

నాలుగు కేసులు. 18 మంది అరెస్టు

నాలుగు కేసులు. 18 మంది అరెస్టు

ముందుజాగ్రత్త చర్యగా కేరూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. రెండు వర్గాల మద్య గొడవలు జరగడంతో నాలుగు కేసులు నమోదు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నామని బాగల్ కోటే జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు.ఇంకా కొంత మందికోసం గాలిస్తున్నామని, హిందూ, ముస్లీం మతపెద్దలతో శాంతి చర్చలు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ జయప్రకాష్ స్థానిక మీడియాకు చెప్పారు.

మండిపడిన మాజీ సీఎం

మండిపడిన మాజీ సీఎం

బాదామిలో రెండు వర్గాల మద్య గొడవలు జరగడానికి కొందరు ప్రయత్నించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడుతున్నారు. కొందరు స్వార్థం కోసం అమాయకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్దీపొందాలని అనుకుంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య పరోక్షంగా బీజేపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, తాను బాగల్ కోటే జిల్లా ఎస్పీ

జయప్రకాష్ తో మాట్లాడానని మాజీ సీఎం సిద్దరామయ్య ఓ ప్రకటన విడుదల చే శారు.

English summary
Violence: Karnataka police registered case against who involved in communal violence near Badami in Bagalkot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X