Actress:ఫేమస్ నటి, కూతురు, తల్లి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ?, వైరల్, స్టూడెంట్ టార్గెట్ !

చెన్నై/తిరువనంతపురం: బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన మహిళ తరువాత పలు బాషల సినిమాలలో నటించింది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఎంతో మంచిపేరు వచ్చింది. బహుబాష నటిగా ఆమె తనకంటే ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. సూపర్ డూపర్ హిట్ అయిన టీవీ సీరియల్స్ లో ఆమె కీలకపాత్రల్లో నటిస్తోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకుంది. ఇలాంటి నటి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. అంతటితో కామ్ గా ఉండకుండా నటితో పాటు ఆమె కూతురు, నటి తల్లి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. నటితో పాటు ఆమె ఫ్యామిలీలో ముగ్గురు మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ కవడంతో అందరూ హడలిపోయారు.

బాలనటిగా సినిమాల్లో ఎంట్రీ

బాలనటిగా సినిమాల్లో ఎంట్రీ

కేరళకు చెందిన ప్రవీణ అనే మహిళ 1992లో విడుదలైన గౌరీ చిత్రంలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత తమిళ సీరియల్స్‌లో ప్రవీణ నటించింది. తీరన్ అకాహమీర్ ఉదుడు చిత్రంతో తమిళ సినీ రంగంలో ప్రవీణ ఎంట్రీ ఇచ్చింది. తమిళ సూపర్ హిట్ సినిమా స్వామీ 2, కోమలి, టెడ్డీ వంటి తమిళ చిత్రాలలో నటించిన ప్రవీణ ఆమె కంటూ మంచి నటిగా గుర్తింపె తెచ్చుకుంది.

నటి, సింగర్, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు

నటి, సింగర్, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు

నటి ప్రవీణ ఓ మళయాలం సినిమాలో నటించి ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వ నుంచి అవార్డు సొంతం చేసుకుంది. ప్రవీణ నటిగానే కాకుండా నేపథ్య గాయనిగా కేరళ ప్రభుత్వం అవార్డు అందుకుంది. ప్రవీణ ప్రస్తుతం తమిళంలో ఓ ప్రైవేట్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న రాజా రాణి 2 సీరియల్‌లో కీలకపాత్రలో నటిస్తోంది.

పోలీసులను ఆశ్రయించిన నటి

పోలీసులను ఆశ్రయించిన నటి

సౌత్ ఇండియన్ సినిమాల్లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ గతేడాది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో కొందరు తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో పెడుతున్నారని, వారి మీద తీసుకోవాలని నటి ప్రవీణ పోలీసు అధికారులకు మనవి చేశారు. కేసు నమోదు చేసిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన భాగ్యరాజ్‌ అనే కాలేజ్ విధ్యార్థిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

నటి కూతురి ఫోటోలు వైరల్

నటి కూతురి ఫోటోలు వైరల్

కొన్ని నెలలుగా జైలులో ఉన్న భాగ్యరాజ్ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొద్దిరోజుల క్రితం నటి ప్రవీణతో పాటు ఆమె కూతురు మార్ఫింగ్ ఫొటోలు కూడా ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో షాక్‌కు గురైన నటి ప్రవీణ తన స్నేహితురాళ్ల ద్వారా ఈ విషయం తెలుసుకుని కూతురితో వెళ్లి మళ్లీ కేరళ సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది.

జైలు నుంచి వచ్చి నటి మీద కాలేజ్ విద్యార్థి ప్రతీకారం

జైలు నుంచి వచ్చి నటి మీద కాలేజ్ విద్యార్థి ప్రతీకారం

జైలు నుంచి బయటకు వచ్చిన భాగ్యరాజ్ తన మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తనతో పాటు తన కూతురు, తల్లి, సోదరి కలిసి ఉన్న ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నారని నటి ప్రవీణ పోలీసులను ఆశ్రయించింది.. దిక్కుతోచని మానసిక రోగిగా మారిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నటి ప్రవీణ పోలీసులకు మనవి చేశారు. నటి ప్రవీణ కేసు పెట్టడంతో

ఆమె ఫ్యామిలీ అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేసిన భాగ్యరాజ్‌ను కేరళ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. భాగ్యరాజ్ కాలేజీ విద్యార్థి అని పోలీసుల విచారణలో తేలడంతో అతన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+