చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SI Wife: భార్యను చంపేసిన ఎస్ఐ, సీక్రెట్ గా ?, సినిమా స్టోరీ చెప్పాడు, సీన్ రివర్స్ తో, క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/క్రిష్ణగిరి: ఎస్ఐ ఉద్యోగం చేస్తున్న భర్త నిత్యం భార్యతో గొడవ పడుతున్నాడు. 13 సంవత్సరా క్రితం పెళ్లి చేసుకున్న భార్య విషయంలో ఇటీవల ఆ ఎస్ఐ తేడాగా ప్రవర్థించాడని తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఎస్ఐ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత తన భార్య గుండెపోటుతో కుప్పకూలిందని ఆసుపత్రికి తరలించాడు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. వారం తరువాత అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా నమోదు అయ్యింది. కట్టుకున్న భార్యను కసితీరా అతి దారుణంగా చంపేసిన ఎస్ఐ గుండెపోటు డ్రామా ఆడాడని, మంచి సినిమా స్టోరీ చెప్పాడని వెలుగు చూడటంతో సాటి పోలీసులు షాక్ అయ్యారు.

Illegal affair: 35 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్, ఎయిర్ పోర్టు పక్కన సైలెంట్ గా చంపేసిన వార్డు బాయ్ !Illegal affair: 35 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్, ఎయిర్ పోర్టు పక్కన సైలెంట్ గా చంపేసిన వార్డు బాయ్ !

 13 ఏళ్ల క్రితం పెళ్లి

13 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు)లోని క్రిష్ణగిరి ఆనకట్టు పోలీస్ స్టేషన్ లో రమేష్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం రమేష్ రాజ్యలక్ష్మి (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రమేష్, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

హ్యాపీలైష్ లో తేడాలు

హ్యాపీలైష్ లో తేడాలు

రమేష్, రాజ్యలక్ష్మి దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి క్రిష్ణగిరిలోని ఓ పాఠశాల సమీపంలోని పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న రమేష్ ఇంటికి వెళ్లి భార్య రాజ్యలక్ష్మితో గొడవపడేవాడని తెలిసింది. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో తల్లిదండ్రుల గొడవలో తల దూర్చకుండా మౌనంగా ఉండేవాళ్లని సమాచారం.

గుండెపోటు డ్రామా

గుండెపోటు డ్రామా

మే 23వ తేదీ రాత్రి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎస్ రమేష్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత గొడవ పెరిగి పెద్దది అయ్యింది. చుట్టుపక్క వాళ్లు గమనిస్తున్నారని తెలుసుకున్న రమేష్ కొంత సేపు మౌనంగా ఉండిపోయాడని తెలిసింది. అర్దరాత్రి దాటిన తరువాత రమేష్ తన భార్య రాజ్యలక్ష్మికి గుండెపోటుతో కుప్పకూలిపోయిందని ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే రాజ్యలక్ష్మి ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

పోస్టుమార్టుం నివేదికతో షాక్

పోస్టుమార్టుం నివేదికతో షాక్

విషయం తెలుసుకున్న ఇన్స్ పెక్టర్ సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట రాజ్యలక్ష్మిది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. రాజ్యలక్ష్మి మెడ మీద గాయాలు ఉండటంతో పోలీసులు ఎస్ఐ రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇదే సమయంలో రాజ్యలక్ష్మి గుండెపోటుతో మరణించలేదని, ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేశారని వైద్యులు నివేదిక ఇచ్చారు.

Recommended Video

Etela Rajender Wife Jamuna: CM KCR ఆస్తుల గుట్టు.. తడిబట్టతో గొంతు కోత || Oneindia Telugu
గుండెపోటు కాదు..... పక్కా హత్య

గుండెపోటు కాదు..... పక్కా హత్య

అంత వరకు అనుమానాస్పద మరణం అని నమోదు అయిన కేసు ఇప్పుడు హత్య కేసుగా మారిపోయింది. అయితే ఎస్ఐ రమేష్ అతని భార్య రాజ్యలక్ష్మిని ఎందుకు అంత దారుణంగా హత్య చేశాడు అనే విషయం తెలీడం లేదని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. ఎస్ఐ రమేష్ అతని భార్యను హత్య చేశాడు అనే విషయం క్రిష్ణగిరిలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
SI Wife: Krishnagiri SI arrested for murdering wife in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X