Rashmi: స్వామీజీ గదిలోకి అమ్మాయిలను పంపించిన వార్డెన్ ?, రశ్మీ మేడమ్ అరెస్టు, సెకండ్ వికెట్ తో షాక్ !
బెంగళూరు/చిత్రదుర్గ: ప్రముఖ మఠంలో చదువుకుంటున్న అమ్మాయి మీద స్వామీజీ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో ఇప్పటికే స్వామీజీ అరెస్టు అయ్యారు. ఇదే కేసులో రెండో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ లేడీ వార్డన్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్వామీజీ, హాస్టల్ లేడీ వార్డెన్ తో పాటు మొత్తం ఐదు మంది మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఇద్దరు అరెస్టు కావడంతో మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. హాస్టల్ లేడీ వార్డెన్ కు వైద్యపరీక్షలు చేయించి న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

స్వామీజీ, లేడీ హాస్టల్ వార్డెన్ అండ్ కో
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, హాస్టల్ వార్డెన్ రశ్మీతో పాటు మరికొందరు స్వామీజీకి సహకరించారని ఇటీవల అమ్మాయిలు కేసు పెట్టడం కలకలం రేపింది.

దెబ్బకు స్వామీజీ అరెస్టు
చిత్రదుర్గాకు చెందిన మురుగా ఆశ్రమానికి చెందిన అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును పోలీసులు అరెస్టు చెయ్యడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది.

రశ్మీ మేడమ్ అరెస్టు
స్వామీజీని అరెస్టు చెయ్యకముందే అక్కదేవి విద్యాసంస్థల హాస్టల్ వార్డెన్ రశ్మీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి తరువాత ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. గురువారం అర్దరాత్రి డాక్టర్ శివకుమార్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం హాస్టల్ లేడీ వార్డెన్ రశ్మీని అరెస్టు చేశారు.

స్వామీజీ గదిలోకి అమ్మాయిలను పంపిస్తున్న మేడమ్ ?
స్వామీజీ, హాస్టల్ లేడీ వార్డెన్ రశ్మీతో పాటు మొత్తం ఐదు మంది మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే స్వామీజీ, రశ్మీ అరెస్టు కావడంతో మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. హాస్టల్ లేడీ వార్డెన్ రశ్మీకి వైద్యపరీక్షలు చేయించి న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి చిత్రదుర్గ పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. మురుగా మఠం స్వామీజీ గదిలోకి అమ్మాయిలను బలవంతంగా పంపిస్తోందని హాస్టల్ వార్డెన్ రశ్మీ ఆరోపణలు ఎదర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications