వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్‌ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్‌ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమించేశారు. ప్రభుత్వ బలగాలు కనీసం ప్రతిఘటించకుండా చేతులెత్తేశాయి. దీనితో పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా కాబుల్.. తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ముందే పసిగట్టిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. దేశం విడిచి వెళ్లిపోయారు. పొరుగునే ఉన్న తజకిస్తాన్‌కు చేరుకున్నారు.

Recommended Video

#Afghanistan Crisis: UK PM Boris Johnson Blames US | Oneindia Telugu

ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్

 అమెరికా సైన్యం ఉపసంహరణతో.. పతనం..

అమెరికా సైన్యం ఉపసంహరణతో.. పతనం..

దీనితో ప్రభుత్వం కుప్పకూలినట్టయింది. ఇక తాలిబన్ల పాలన ఆరంభం కావడం ఒక్కటే మిగిలి ఉంది. ఆప్ఘనిస్తాన్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నింటికీ అగ్రరాజ్యం అమెరికా కారణమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతోన్నాయి. సర్వత్రా అవే తరహా వాదనలు వినిపిస్తోన్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు అండదండగా ఉంటూ వచ్చిన అమెరికా.. తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వల్లే తాలిబన్లు మళ్లీ విజృంభించారని కుండబద్దలు కొట్టారు.

 డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ ఏంటీ?

డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ ఏంటీ?

అమెరికా సైన్యం వెనక్కి మళ్లిన అతి కొద్దిరోజుల్లోనే తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాయని స్పష్టం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో జో బిడెన్ దారుణంగా విఫలం చెందారని ఆరోపించారు. ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. జో బిడెన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. బిడెన్ తప్పుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం, సమయం దొరకదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

అగ్రరాజ్యం హోదాకు..

అగ్రరాజ్యం హోదాకు..

ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం, బిగ్ బ్రదర్ అనే హోదా అమెరికాకు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి హోదాకు జో బిడెన్ ఎసరు పెట్టారనేది డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఏ మాత్రం ముందు చూపు లేకుండా జో బిడెన్ వ్యవహరించారనడానికి ఆప్ఘనిస్తాన్ అతి పెద్ద నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు. మరిన్ని సంక్షోభాలు తప్పకపోవచ్చని విమర్శించారు. వెంటనే బిడెన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని కూడా బిడెన్ సమర్థవంతంగా నిర్వహించట్లేదని ఆరోపించారు.

 దోహా ఒప్పందం ఏం చెబుతోంది?

దోహా ఒప్పందం ఏం చెబుతోంది?

నిజానికి- డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే తాలిబన్లతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2021 మే నాటికి దశలవారీగా ఆప్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ప్రజల భద్రత, ప్రాణాలపై పూర్తిగా తాలిబన్ల నుంచి హామీ అందిన తరువాతే ఒప్పందాలపై అమెరికా ముందుకెళ్లింది. ఆ తరువాత ప్రభుత్వం మారడం.. నిర్దేశిత గడువు కంటే ముందే జో బిడెన్ ప్రభుత్వం తన సైన్యాన్ని ఆప్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకోవడంతో తాలిబన్లకు మరో అవకాశాన్ని ఇచ్చినట్టయింది.

 తాలిబన్లకు ఊపిరి..

తాలిబన్లకు ఊపిరి..

అమెరికా తన సైన్యాన్ని ఉపసంహించుకోవడం మొదలు పెట్టడం తాలిబన్లకు ఊపిరి పోసినట్టయింది. బలపడటం మీద దృష్టి సారించారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద దండయాత్ర మొదలుపెట్టారు. అమెరికా సైన్యం పహారా కాస్తోన్న సమయంలో తమకు పట్టు ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమైన తాలిబాన్లు అతి కొద్ది రోజుల్లోనే దేశం మొత్తాన్నీ ఆక్రమించేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఈ పరిణామం మళ్లీ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించినట్టవుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. దీనికంతటికీ మూలకారకుడు జో బిడెనే అని, వెంటనే ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్.

English summary
Former US president Donald Trump called for present president Joe Biden to resign over the takeover of Afghanistan by Taliban, as US troops withdrew from the country after nearly 20 years on
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X