హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ లింకులపై మళ్ళీ బాంబు పేల్చిన బీజేపీ; రాజకీయవర్గాలలో ఆసక్తి!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇప్పుడు హైదరాబాద్లోనూ చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రదాడిని ప్రారంభించిన బీజేపీ, మద్యం విక్రయాల కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నట్లు పేర్కొంటున్న రెండో 'స్టింగ్' ఆపరేషన్ కి సంబంధించిన టేప్‌ను తాజాగా విడుదల చేసింది.

మద్యం కుంభకోణంలో కీలక వీడియో ఆధారాలున్నాయన్న ఢిల్లీ బీజేపీ నేతలు

మద్యం కుంభకోణంలో కీలక వీడియో ఆధారాలున్నాయన్న ఢిల్లీ బీజేపీ నేతలు

బిజెపి ఎంపి డాక్టర్ సుధాన్షు త్రివేది, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు మంజీందర్ సింగ్ సిర్సా మద్యం విక్రయాల కాంట్రాక్టులకు సంబంధించిన అవినీతికి సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు హైదరాబాద్ లో లింకులు ఉన్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్, ఇతర బీజేపీ ఎంపీలు రమేష్ బిధూరి, ప్రవేశ్ సాహిబ్ సింగ్, హన్సరాజ్ హన్స్ ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చడం ద్వారా కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అమిత్ అరోరా స్టింగ్ వీడియో రిలీజ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అమిత్ అరోరా స్టింగ్ వీడియో రిలీజ్

గోవా, పంజాబ్‌లో ఎన్నికల కోసం 100 కోట్ల రూపాయలను మద్యం దిగ్గజాలు ఆప్‌కి నగదు రూపంలో ఇచ్చారని బిజెపి ప్రసారం చేసిన స్టింగ్ వీడియో పేర్కొంది. "ఇంతకుముందు రూ. 10 లక్షలకు ఇచ్చిన లైసెన్స్, రూ. 5 కోట్ల వరకు పెంచారని, మద్యం విక్రయాలలో ఎక్కడ సామాన్యులు లేరని పేర్కొంది. ఆరోపించిన స్టింగ్ టేప్‌లో ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో నిందితులలో ఒకరైన అమిత్ అరోరా ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లైసెన్స్‌ల కోసం కమీషన్‌ని నిర్ణయించిందని మరియు ఆ డబ్బును పంజాబ్ మరియు గోవా ఎన్నికలకు ఉపయోగించిందని అమిత్ అరోరా పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లింకులపై ఆధారాలు కోర్టులో ఇస్తామన్న బీజేపీ నేతలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లింకులపై ఆధారాలు కోర్టులో ఇస్తామన్న బీజేపీ నేతలు

మార్కెట్‌లో కొంతమంది గుత్తాధిపత్యానికి సహాయపడటానికి ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చిన్న వ్యాపారులను ఎక్సైజ్ పాలసీ నుండి దూరంగా ఉంచిందని అరోరా పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ నేతలు లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు? ఎవరెవరిని కలిశారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఎవరెవరు ఎప్పుడు ఎవరెవరిని కలిశారు అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక ఈ ఆధారాలను కోర్టుకు అందిస్తామని తెలిపారు.

 ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణాలో ప్రకంపనలు

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణాలో ప్రకంపనలు

బిజెపి మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ లింకులపై గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇక తాజాగా మరోమారు హైదరాబాద్ తో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్న లింకులపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంలో ఎవరి పేరు బయటకు వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆధారాలలో ఉన్నది ఎవరు? ఆసక్తికర చర్చ

ఆధారాలలో ఉన్నది ఎవరు? ఆసక్తికర చర్చ

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్లోనూ ఈడీ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. కవితకు అత్యంత సన్నిహితుల ఇళ్లలో, వారి కార్యాలయాలపై ఈడీ దాడులు జరగగా తాజాగా మరోమారు హైదరాబాద్ కు లింకులపై చేసిన వ్యాఖ్యలతో డిల్లీ లిక్కర్ కుంభకోణంపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

English summary
There is complete evidence on the links of Hyderabad in Delhi Liquor Scam. Delhi BJP leaders' comments that they will give it in court have once again created tremors in the liquor scam in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X