తొలిప్రేమ సినిమాకు కేటీఆర్ ప్రశంసలు, హీరోయిన్ రాశిఖన్నా థ్యాంక్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన తొలిప్రేమ చిత్రంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను శనివారం రాత్రి కేటీఆర్ చూశారు. సినిమా బాగుందంటూ చిత్ర యూనిట్‌కు కితాబిచ్చారు.

శనివారం రాత్రి సరదాగా గడిచిపోయిందని, తొలిప్రేమ సినిమాను చూశానని, చాలా కాలం తర్వాత తెలుగులో ఓ చక్కటి ప్రేమకథా చిత్రం చూశానని, దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను బాగా తెరకెక్కించారని, పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయని, వరుణ్, రాశీ చాలా బాగా నటించారని ట్వీట్ చేశారు.

KTR lauds Thaman and Tholi Prema team

కేటీఆర్ ట్వీట్‌పై రాశీ కన్నా స్పందించారు. మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ధన్యవాదాలు సార్ అని పేర్కొన్నారు. థమన్ కూడా థ్యాంక్స్ చెప్పారు. కేటీఆర్ ఇటీవల ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలపై కూడా ప్రశంసలు కురిపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Varun Tej’s recent outing Tholi Prema has been winning the hearts of the audience all over. The film opened to packed houses and huge response all over. Telangana IT Minister KTR happened to watch the film and he lauded Thaman. He took twitter to say “Great Job Thaman BG & Music was outstanding and so were lyrics. My compliments”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి