హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టచ్ చెయ్యండి చూద్దాం.. హైదరాబాద్‌కు బీఎల్ సంతోష్.. కవ్వింపు చర్యేనా? సిట్ కింకర్తవ్యం!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల ఎర కేసులో తీవ్ర ఆరోపణలు గుప్పించి ఎలాగైనా అరెస్టు చేసి, ఆయనను విచారించాలని భావించిన బీఎల్ సంతోష్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. బిజెపిలో కీలక నాయకుడైన బి ఎల్ సంతోష్ పర్యటన నేపథ్యంలో ఆయనను టచ్ చేయండి చూద్దాం అన్నట్టుగా బిజెపి నేతల తీరు ఉంటే, సిట్ అధికారులు ఏం చెయ్యాలి అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాష్ట్రంలో బి ఎల్ సంతోష్ పై సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన క్రమంలో, కోర్టు సిట్ నోటీసులపై స్టే విధించడంతో ప్రస్తుతం ఆయన రాక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక రాజకీయ విశ్లేషకులలో ఇది కవ్వింపు చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 తెలంగాణాకు బీఎల్ సంతోష్ .. దిక్కుతోచని స్థితిలో సిట్

తెలంగాణాకు బీఎల్ సంతోష్ .. దిక్కుతోచని స్థితిలో సిట్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసి బిజెపి నాయకులను ఇరికించాలని భావించారు. సిట్ విచారణ దూకుడుగా సాగి బీజేపీ నేతలకు ఉచ్చు బిగుస్తుంది అని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చేలా తయారయ్యాయి. అయితే నోటీసులు జారీ చేసిన ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు, వారి నోటీసులపై స్టే విధించింది. దీంతో సిట్ అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇటువంటి పరిస్థితులలోనే బీయల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తీరుతామని శతవిధాల ప్రయత్నం చేసిన సిట్ అధికారులు ఇప్పుడు బిఎల్ సంతోష్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి చోటు చేసుకుంది.

విచిత్ర పరిస్థితుల మధ్య హైదరాబాద్ కు బీఎల్ సంతోష్

విచిత్ర పరిస్థితుల మధ్య హైదరాబాద్ కు బీఎల్ సంతోష్

ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ శిక్షణా తరగతుల కోసం బి ఎల్ సంతోష్ వస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో జరగనున్న ఈ శిక్షణా తరగతులలో ఆయన పాల్గొననున్నారు. 29వ తేదీన అసెంబ్లీ ఇన్చార్జిలు, కన్వీనర్లు, విస్తారక్ లు, పాలక్ లకు ఆయన ఈ సమావేశంలో మార్గనిర్దేశం చేయనున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శిక్షణా తరగతులు, కార్యవర్గ సమావేశాలకు బి ఎల్ సంతోష్ హాజరుకాలేదు. అప్పుడు గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కార్యక్రమాలకు హాజరు కాలేదని నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు బీఎల్ సంతోష్ విచిత్ర పరిస్థితుల మధ్య హైదరాబాద్ కు వస్తున్నారు.

తాజా పరిణామాలతో బీఎల్ సంతోష్ కు తెలంగాణాలోకి రెడ్ కార్పెట్

తాజా పరిణామాలతో బీఎల్ సంతోష్ కు తెలంగాణాలోకి రెడ్ కార్పెట్

రాష్ట్రంలో తాజా పరిస్థితులు బి ఎల్ సంతోష్ ను ఎమ్మెల్యేల ఎర కేసు అనుమానితుడు గా భావించి దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు గట్టిగా భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా లేవు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బి యల్ సంతోష్ కాలు పెట్టబోతున్నారు. ఇక ఆయన రావడానికి ముందే తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిస్థితులు కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ డి ఎంటర్ కావడం, తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సిబిఐ చేతికి ఇవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి అనేక పరిణామాలు బి ఎల్ సంతోష్ కు తెలంగాణ రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.

బీఎల్ సంతోష్ తెలంగాణా పర్యటన కవ్వింపు చర్యనేనా? సిట్ ఏం చేస్తుంది?

బీఎల్ సంతోష్ తెలంగాణా పర్యటన కవ్వింపు చర్యనేనా? సిట్ ఏం చేస్తుంది?

బి ఎల్ సంతోష్ పై చర్యలు తీసుకోవాలని, సిట్ భావిస్తున్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కార్యక్రమాలలో పాల్గొని బిఎల్ సంతోష్ వెళ్లిపోతే తెలంగాణ ప్రభుత్వం అసమర్థంగా చూస్తూ ఉండి పోయింది అన్న టాక్ కచ్చితంగా వచ్చి తీరుతుంది. బి ఎల్ సంతోషి తెలంగాణ పర్యటనను కవ్వింపు చర్యగా పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు? బిఎల్ సంతోష్ ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? వంటి అంశాలపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

English summary
The arrival of BL Santosh, who is a suspect in the MLAs poaching case, has now become a headache for the SIT. It is felt that his arrival is an act of provocation. And it became interesting that what will do SIT to stop him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X