హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మాస్క్ లేకుండా అడుగు బయట పెడితే.. జేబులు గుళ్లే: ఆ జోన్లలో ప్రైవేటు సంస్థలు ఓపెన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన వేళ.. కేసీఆర్ సర్కార్ కఠిన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రభావ రహిత ప్రాంతాల్లో సడలింపులను ఇచ్చింది. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో కొనసాగించాల్సిన కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

అర్ధరాత్రి వైజాగ్ ఎయిర్‌పోర్ట్:విషవాయువులు వెలువడిన వేళ..విశాఖకు చేరిన స్పెషల్ ఫ్లైట్: కాస్సేపట్లో..అర్ధరాత్రి వైజాగ్ ఎయిర్‌పోర్ట్:విషవాయువులు వెలువడిన వేళ..విశాఖకు చేరిన స్పెషల్ ఫ్లైట్: కాస్సేపట్లో..

తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ మాస్క్‌లను ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా రోడ్ల మీద తిరుగాడితే.. 1000 రూపాయల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చింది. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి కామారెడ్డిలో 500 రూపాయల ఫైన్‌ను విధించారు. ఈ మొత్తాన్ని పెంచాల్సి 1000కి ఉంటుంది.

 Rs 1000 fine for step out from home with out mask in Telangana

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధితో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రీన్, ఆరెంజ్ జోన్లల్లో ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వందశాతం ఉద్యోగులతో పని చేయించుకోవచ్చని పేర్కొంది. తప్పనిసరిగా కరోనా వైరస్ సోకకుండా ముందుజాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ, రెడ్‌జోన్లలో 33 శాతం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Recommended Video

Liquor Shops Reopen : Public Opinion On Liquor Price Hike | Oneindia Telugu

తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకొచ్చిన తరువాత విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ఒకరికి మించి ఎవరూ గుమికూడొద్దని ఆదేశించింది. అత్యవసరంగా వైద్య సహాయాన్ని తీసుకోదల్చిన వారికి మినహాయింపు ఇచ్చింది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహా మరే ఇతర దుకాణాలను కూడా తెరవడానికి అనుమతించరు.

English summary
Telangana Chief Secretary Sri Somesh Kumar has issued the what businesses can open in Red, Orange and Green Zones in Telangana state during lockdown period. Mask shall be mandatory for everyone to wear a face cover/mask in public places. Each violation shall attract a fine of Rs.1000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X