వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలు నిలిపిన గవర్నర్ - ప్రయాణీకుడికి గుండెపోటు: ప్రయాణిస్తున్న విమానంలోనే..!!

|
Google Oneindia TeluguNews

గవర్నర్ తమిళిసై. ఈ మధ్య కాలంలో వరుస పర్యటనలు.. నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. ఆపదలో ఉన్న సాధారణ విమాన ప్రయాణీకుడికి అసవరమైన సమయంలో చికిత్స అందించి మరోసారి ప్రశంసలు అందుకున్నారు. గవర్నర్ తమిళసై వారణాసికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో ఢిల్లీ- హైదరాబాద్ విమానంలో బయల్దేరారు. అర్ద్రరాత్రి వేళ ప్రయాణిస్తున్న ఆ విమానంలో సాధారణ ప్రయాణీకురాలు లాగానే తమిళసై తోటి ప్రయాణీకులతో పాటుగా కూర్చుకున్నారు.

విమానం ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా

విమానం ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా

ఆ సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతీ నొప్పిగా ఉందని.. గాలి ఆడటం లేదని విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే విమాన సిబ్బంది.. ప్రయాణీకుల్లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ అనౌన్స్ మెంట్ ద్వారా ప్రశ్నించారు. దీంతో..వెంటనే ప్రయాణీకుల్లో ఉన్న గవర్నర్ తమిళసై స్పందించారు. వెంటనే ప్రయాణీకుడికి బీపీ చెక్ చేయటంతో పాటుగా.. ప్రాధమిక చికిత్స అందించారు. దీంతో..ఆయన వెంటనే తేరుకున్నారు. అస్వస్థతకు గురైన ప్రయాణీకుడికి సమస్య వివరించి.. ఓదార్పు ఇచ్చారు. కావాల్సిన మందులు అందించారు.

తక్షణం స్పందించి వైద్యురాలిగా సేవ

తక్షణం స్పందించి వైద్యురాలిగా సేవ

వెంటనే స్పందించి చికిత్స అందించటంతో విమానంలోని తోటి ప్రయాణీకులు.. చికిత్స అందుకున్న వ్యక్తి సైతం ధన్యవాదాలు చెప్పారు. అనౌన్స్ మెంట్ ద్వారా విమాన సిబ్బంది ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్ లో దిగిన వెంటనే ఆ ప్రయాణీకుడిని వీల్ ఛైర్ లో విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించారు.

గవర్నర్ తమిళసై ముందు వైద్య విద్య పూర్తిచేసారు. ఎంబీబీఎస్ చేసి..డీజీఓ లో ఎండీ పట్టా అందుకున్నారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విమానంలో ఉన్న పలువురు గవర్నర్ ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభినందిస్తున్నారు.

గవర్నర్ కు ప్రశంసలు.. వైరల్

గవర్నర్ కు ప్రశంసలు.. వైరల్

ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ఇండిగో సంస్థకు కొన్ని సూచనలు చేసారు. రైళ్ల తరహాలోనే ప్రయాణీకుల్లో వైద్యుల గురించి తెలుసుకొనేందుకు ప్రయాణీకుల ఛార్ట్ తయారు సమయంలో వివరాలు సేకరించాలని సూచించారు. సాధారణంగా రాజకీయ వేత్తలు ఇటువంటి సమయాల్లో దగ్గరలోని విమనాశ్రయంలో విమానం దింపి..ప్రయాణీకుడికి సేవలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచిస్తారని..కానీ, తనకు గవర్నర్ హోదాలో ఉన్నా సాధారణ వైద్యురాలిగానే సేవలు చేసి..తనను ఆపద నుంచి గట్టెక్కించారంటూ బాధిత ప్రయాణీకుడు చెప్పుకొచ్చారు.

English summary
Governor Tamilsai soundararajan treates sick passenger mid air on flight when return from Varanasi to Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X