• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో: డాడీని కొట్టొద్దంకుల్! కొడుకు ఎదుటే తండ్రిపై పోలీసుల దాడి, కరెక్ట్ కాదంటూ కేటీఆర్ ఫైర్

|

హైదరాబాద్: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే బయటికి రాకుండా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. కొందరు అనవసరంగా బయటికి వచ్చి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. అయితే, మరికొందరు ఏదో అవసరం ఉండి బయటికి వచ్చినప్పటికీ కొందరు పోలీసులు విచక్షణ మరిచి వారిపై దాడి చేస్తున్నారు. దీంతో మొత్తం పోలీసు విభాగానికే చెడ్డపేరు వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.

రెచ్చిపోయిన పోలీసులు..

రెచ్చిపోయిన పోలీసులు..

ఓ వ్యక్తి బుధవారం తన భార్య, కొడుకుతో ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చాడు. దీంతో పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బయటకి వచ్చారంటూ అతడ్ని పోలీసులు ప్రశ్నించారు. దీంతో అతడు పోలీసులతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి రెచ్చిపోయి అతడిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న అతడి కుమారుడు వద్దంటూ కేకలు వేశాడు.

డాడీని కొట్టొద్దంటూ చిన్నారి వేడుకుంటున్నా..


‘మా డాడీని కొట్టొద్దు అంకుల్' అంటూ అ వ్యక్తి కుమారుడు పోలీసులను వేడుకున్నాడు. అయినా కూడా పోలీసులు పట్టించుకోకుండా దాడి చేశారు. ఆ తర్వాత అతడ్ని, అతడి కుమారుడిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసిన వ్యక్తి ..ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు పోలీసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల ఫైర్.. స్పందించిన బాలల హక్కుల సంఘం

నెటిజన్ల ఫైర్.. స్పందించిన బాలల హక్కుల సంఘం

చిన్న పిల్లాడి ముందు అతడి తండ్రిని కొడితే.. అతడు ఎంత భావోద్వేగానిిక గురైతాడో పోలీసులు ఆలోచించరా? అంటూ మండిపడుతున్నారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ పలవురు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆ వీడియోను రీట్వీట్ చేశాడు. దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఇలావుండగా, బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో బయటకు రావడం తప్పే కానీ.. చిన్నపిల్లాడి ముందు తన తండ్రిని కొడితే అతని భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఆలోచించరా? ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని అన్నారు.

  Telangana Lockdown: People Offer Free Food To Hyderabad Police During Duty

  మంచి పోలీసుల శ్రమ వృథా అంటూ కేటీఆర్..

  ఈ ఘటనకు సంబంధించిన వీడియో తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ సదరు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఘటన సహేతుకమైనది కాదని అన్నారు. సదరు పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు. లేదంటే వేలాది మంది పోలీసులు చేస్తున్న సేవలకు అర్థం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు కూడా స్పందించారు. సదరు పోలీసుల తీరుపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

  కాగా, కేటీఆర్ ట్వీట్ నేపథ్యంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ అశోక్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

  English summary
  wanaparthy police personnel attacked a man infront his son: KTR annoyed it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X