హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Sharmila: దొర దిగొచ్చిండు గానీ: 50 వేలు కాదు..లక్షా 90 వేలు: పోరాటం తీవ్రం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాల తీవ్రతను మరింత ముమ్మరం చేశారు. దూకుడు పెంచారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనను దొర అని సంబోధిస్తూ తన డిమాండ్లను ఆయన ముందు ఉంచుతున్నారు. యువత, రైతాంగం, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రకు సన్నద్ధమౌతోన్నారు.

Zika virus: పొరుగు రాష్ట్రం హైఅలర్ట్: సరిహద్దు జిల్లాల్లో: కొత్త గైడ్‌లైన్స్ జారీZika virus: పొరుగు రాష్ట్రం హైఅలర్ట్: సరిహద్దు జిల్లాల్లో: కొత్త గైడ్‌లైన్స్ జారీ

కేసీఆర్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని ప్రకటించడాన్ని తప్పు పట్టారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. కనీసం అందులో సగం కూడా భర్తీ చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాటి కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసేలా కేసీఆర్‌పై ఒత్తిడిని తీసుకుని రావడంలో తమ విజయవంతమైందని, దాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.

YSRTP Chief YS Sharmila demands for release the notification for 190000 jobs in Telangana

తాము చేసిన ఉద్యమం, నిరాహార దీక్షలతో కేసీఆర్ దొర కళ్లు తెరచుకున్నారని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టక ముందే తాము నిరుద్యోగుల కోసం చేసిన దీక్ష వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ దిగొచ్చి ఉద్యోగ నోటిఫికెషన్స్ విడుదల చేస్తామని మాట్లాడుతున్నారని, ఈ ఘనత తమ పార్టీకి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ 50 వేలు మాత్రమే కాదని..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, వారికి తమ పార్టీ అండగా నిలుస్తుందని, పోరాటం చేస్తుందని అన్నారు.

English summary
YSRTP Chief YS Sharmila demands to the Chief Minister KCR led TRS government in Telangana for release the notification for 1,90,000 jobs in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X