• search
 • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తనపై కేసు పెట్టించింది సీఎం కార్యాలయ ఉన్నతాధికారినే .. ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

|

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన తాజాగా మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన కామెంట్లతో వైసీపీ కి తలనొప్పిగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనను ఎంపీగా అనర్హుడిగా చేయలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు.

జగన్ పై అందరికీ కన్ఫ్యూజన్ .. లోగుట్టు స్వరూపానందకే ఎరుక :కొడాలి నానీకి రఘురామ చురక

జగన్ మోడీని కలవటం , అదే రోజు బ్యాంక్ చైర్మన్ జగన్ ను కలవటంపై అనుమానం

జగన్ మోడీని కలవటం , అదే రోజు బ్యాంక్ చైర్మన్ జగన్ ను కలవటంపై అనుమానం

బ్యాంకులకు 23 వేల కోట్ల రూపాయలను ఎగవేశానంటూ ఓ పత్రికలో రాసిన కథనంతో వారి విశ్వసనీయత మరింత దిగజారిందని పేర్కొన్న రఘురామ ఈ కుట్రకు కారకులు వారేనంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.

తనపై ఈ నెల ఆరవ తేదీన కేసు నమోదైందని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు అదే రోజు ప్రధానమంత్రి మోడీని జగన్మోహన్ రెడ్డి కలిశారని, అదే రోజు పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారని , ఈ కలయిక వెనుక ఏదో ఆంతర్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

మూడు, నాలుగు నెలల్లో జైలుకు వెళ్ళే వారిపై కేసులు ఎందుకని ఊరుకున్నా

మూడు, నాలుగు నెలల్లో జైలుకు వెళ్ళే వారిపై కేసులు ఎందుకని ఊరుకున్నా

అంతేకాదు బ్యాంకుల ద్వారా తనకు మంజూరైన మొత్తం రుణాలు 4 వేల కోట్ల లోపే అని అందులో రెండు వేల కోట్లు ఇప్పటికీ బ్యాంకు నుండి విత్ డ్రా చేయలేదని పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తున్న వారిపై 43 వేల కోట్ల ఆరోపణలు ఉన్న కారణంగా తనపై 23 వేల కోట్ల ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తప్పుడు వార్తలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేయాలని తన న్యాయవాదులు సూచిస్తున్నారు అని, అయితే మూడు నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై కేసు వేయడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తా.. తనపై కేసుకు కారణం ఆయనే

సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తా.. తనపై కేసుకు కారణం ఆయనే

వ్యాపారం కోసం రుణం తీసుకొని 826.17 కోట్ల రూ దారి మళ్లించినట్లుగా రఘురామకృష్ణం రాజు కు సంబంధించిన ఇండ్ భారత ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ తో పాటు, దాని డైరెక్టర్లు అధికారులపై ఢిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు పై మాట్లాడిన రఘురామకృష్ణంరాజు తన వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీబీఐ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. అయితే తనపై సీఎం కార్యాలయం ఉన్నతాధికారి కేంద్ర ఆర్థిక శాఖ లో ఉన్న తన బ్యాచ్ మేట్ ద్వారా కేసు వేయించేలా చేశారని రఘురామ ఆరోపణలు గుప్పించారు. ఆయన పేరుతో సహా ప్రస్తావించారు .

  MAA Passes New Rule, Actors Remuneration To Be Reduced By 20 Percent | Oneindia Telugu
  తనకు పోటీ చెయ్యటానికి టికెట్ ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోర్ వల్లే

  తనకు పోటీ చెయ్యటానికి టికెట్ ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోర్ వల్లే

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన నాటి నుండి తనను టార్గెట్ చేసి కుట్రలు చేస్తూనే ఉన్నారని విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజు, గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకూడదని కుట్రపన్నారని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్ జోక్యం తోనే తనకు పోటీ చేసే అవకాశం లభించిందని కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, సీఎం చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని రఘు రామ పేర్కొన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు తీసుకొని ఆ నిధులు తాను తినేస్తే ప్రాజెక్టులు ఎవరు కడతారు అంటూ ప్రశ్నించిన రఘురామ ఈ అంశాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్తానని, తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

  English summary
  Narasapuram MP Raghurama Krishnam Raju who has become a headache for the YCP with his sensational comments. He has criticized the YCP leaders for engaging in degenerate politics as they could not disqualify him as an MP. He alleged that a senior official of the CM's office was behind the case against him. He clarified that he will answer to the CBI that he didn't do any irregularities. .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X