హోం
 » 
ఏ.కే. ఆంటోని

ఏ.కే. ఆంటోని

ఏ.కే. ఆంటోని

ఏ. కే.

ఏ.కే. ఆంటోని బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఏ. కే. ఆంటోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. మూడుసార్లు కేరళ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ముఖ్యమంత్రి కరుణాకరన్ ప‌లు కేసుల‌లో చిక్కుకుని రాజీనామా చేయ‌డంతో, ఆయన స్థానంలో ఆంటోని రెండు సార్లు, స్వ‌ల్ప కాలం పాటు కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. 2001లో ఆయ‌న పూర్తికాలం ప‌ద‌విలో ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించ‌డంతోపాటు, ఆయ‌న రాజ్య‌స‌భ‌కు అయిదు సార్లు, రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు నాలుగుసార్లు ఎన్నిక‌య్యారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా దాదాపు ద‌శాబ్ధ కాలం పాటు కొన‌సాగారు. ఆ ప‌ద‌విలో ఎక్కువ‌కాలం సేవ‌లందించిన వ్య‌క్తిగా రికార్డు సృష్టించారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

ఏ.కే. ఆంటోని వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఏ.కే. ఆంటోని
పుట్టిన తేదీ 28 Dec 1940 (వ‌య‌స్సు  83)
పుట్టిన ప్రాంతం ఛెర్తాలా, జిల్లా. అల‌ప్పుజ‌, కేర‌ళ
పార్టీ పేరు Indian National Congress
విద్య
వృత్తి న్యాయ‌వాది, రాజ‌కీయ, సామాజిక కార్య‌క‌ర్త‌
తండ్రి పేరు అరక్క‌ప‌రంబిళ్ కురియ‌న్ పిళ్లై
తల్లి పేరు అలే కుట్టి
జీవిత భాగస్వామి పేరు ఎలిజ‌బెత్ ఆంటోని
జీవిత భాగస్వామి వృత్తి కెన‌రా బ్యాంకు మేనేజీరియ‌ల్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.
సంతానం 2 కుమారులు
శాశ్వత చిరునామా అంజ‌నం, ఈశ్వ‌ర విలాసం రోడ్, తిరువ‌నంత‌పురం, 695014
ప్రస్తుత చిరునామా 2, జంత‌ర్ మంత‌ర్ రోడ్, న్యూ ఢిల్లీ
ఈ-మెయిల్ [email protected]

ఏ.కే. ఆంటోని నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹80 LAKHS
ఆస్తులు :₹83.23 LAKHS
బాధ్యతలు: ₹3.23 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ఏ.కే. ఆంటోని సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

1977 లో కేవ‌లం 37 ఏళ్ల పిన్న‌ వ‌య‌సులో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఘనత ఆయనది. ఏప్రిల్ 27, 1977 నుంచి అక్టోబ‌రు 27, 1978 వ‌ర‌కు ప‌ని చేశారు.

ఏ.కే. ఆంటోని రాజకీయ జీవితం

2016
  • ఐదో సారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. పౌర విమాన‌యాన శాఖ మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
2014
  • రైల్వేల క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
2010
  • రాజ్య‌స‌భకు నాలుగోసారి ఎన్నిక‌య్యారు.
2006
  • 2006 నుంచి 2014 వ‌ర‌కు దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా సేవ‌లందించారు.
2006
  • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2006
  • జ‌నాభా, ప్ర‌జారోగ్యంపై ఏర్పాటైన పార్ల‌మెంట‌రీ ఫోరంలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
2005
  • రాజ్య‌స‌భ‌కు మూడోసారి ఎన్నిక‌య్యారు.
2001
  • కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
2001
  • శేర్తాలై నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న సీపీఐకి చెందిన చంద్ర‌ప్ప‌న్‌పై 6860 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
1996
  • శేర్తాలై నియోజ‌క‌వ‌ర్గం నుంచి 8385 ఓట్ల మెజార్టీతో నెగ్గి మూడోసారి ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం కేర‌ళ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.
1995
  • రెండోసారి కేర‌ళ ముఖ్య‌మంత్రిగా కొంత‌కాలం పాటు ఆంటోనీ సేవ‌లందించారు.
1993
  • కేంద్ర పౌర స‌ర‌ఫ‌రాలు, వినియోగ‌దారుల వ్య‌వ‌హ‌రాలు, ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
1991
  • రెండోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
1985
  • ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
1977
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న రెండోసారి త్రిసూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీఎల్‌డీకి చెందిన కే.జే. జార్జిపై 4150 ఓట్ల తేడాతో గెలిచారు. అనంత‌రం స్వ‌ల్ప కాలం పాటు కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
1970
  • ఛెర్తాలా నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం అభ్య‌ర్థి ఎన్‌.పీ. థాండ‌ర్‌పై నెగ్గి, శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఏ.కే. ఆంటోని సాధించిన విజయాలు

ముఖ్య‌మంత్రిగా త‌న ప‌ద‌వీకాంలో ఆయ‌న నిరుద్యోగ భృతి, రాష్ట్ర ఉద్యోగుల‌కు పండ‌గ‌ భృతిని ప్ర‌వేశ‌పెట్టారు. వీటితోపాటు అరాక్ అనే మ‌ద్యంపై నిషేధం విధించి, ద‌శ‌ల‌వారీగా కేర‌ళ ఆర్థిక వ్య‌వస్థ‌ను మెరుగుప‌రిచారు. కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం ఈ.కే. నాయ‌నార్ త‌ర్వాత రాష్ట్రానికి అంత‌టి ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ప్ర‌శంస‌లు అందుకున్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X