Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్
అచ్యుతానంద‌న్ 1923 లో కేర‌ళ‌లోని అల‌ప్పుజ‌లో శంక‌ర‌న్‌, అక్క‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. చిన్న వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన ఆయ‌న 11 సంవ‌త్స‌రాల‌కే బ‌ల‌వంతంగా చ‌దువు మానాల్సి వ‌చ్చింది.
By Rashmi | Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

అచ్యుతానంద‌న్ 1923 లో కేర‌ళ‌లోని అల‌ప్పుజ‌లో శంక‌ర‌న్‌, అక్క‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. చిన్న వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన ఆయ‌న 11 సంవ‌త్స‌రాల‌కే బ‌ల‌వంతంగా చ‌దువు మానాల్సి వ‌చ్చింది. జీవ‌నం గ‌డ‌వ‌డం కోసం తొలుత ఆయ‌న త‌న సోద‌రుడితో క‌లిసి టైల‌రింగ్ షాపులో ప‌ని చేసేవారు. ఆ త‌ర్వాత కొబ్బ‌రి పీచు ఫ్యాక్ట‌రీలో కార్మికుడిగా చేరారు. అచ్యుతానంద‌న్ ట్రేడ్ యూనియ‌న్‌లో క్రియాశీల‌క స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించేవారు, ఇది ఆయ‌న భ‌విష్య‌త్తు రాజ‌కీయ జీవితానికి వేదిక‌గా మారింది. సామాన్య జ‌నంలో మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న రాజ‌కీయాల‌లోకి అడుగు పెట్టారు.

2006-11 మ‌ధ్య ఆయ‌న కేర‌ళ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. మ‌రియు 2011 నుంచి 2016 వ‌ర‌కు కేర‌ళ శాస‌న‌స‌భలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. సంస్థాగ‌త మార్గంలో జీవించే విధానాన్ని ఆయ‌న త‌న చిన్న‌నాటి నుంచే బ‌లంగా న‌మ్మేవారు. అవినీతికి వ్య‌తిరేకంగా ఎల్ల‌ప్పుడూ ఆయ‌న త‌న గ‌ళాన్ని వినిపించేవారు. నిరాడంబ‌ర‌త‌కు మ‌రియు అంకిత‌భావానికి మారుపేరుగా నిలిచారు. రైతులు మ‌రియు వారి భూమి స‌మ‌స్య‌లకై పోరాడేందుకు ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ముందుండేవారు. స్వాతంత్య్రోద్య‌మంలోనూ పాల్గొన్న ఆయ‌న 1946 లో జైలుకు కూడా వెళ్లారు.


1970 లో కేర‌ళ‌లో జ‌రిగిన భూ పోరాటాల‌లో ఆయ‌న ముందుండి నిలిచి భూ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయ‌న పోరాటాల ఫ‌లితంగా 1967 లో ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్ ప్ర‌భుత్వం భూసంస్క‌ర‌ణ‌ల చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది.

మరిన్ని చదవండి

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్
పుట్టిన తేదీ 20 Oct 1923 (వ‌య‌స్సు  102)
పుట్టిన ప్రాంతం అల‌ప్పుజా
పార్టీ పేరు Communist Party Of India (marxist)
విద్య 5th Pass
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు శంక‌ర‌న్
తల్లి పేరు అక్క‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు కే. వ‌సుమ‌తి
జీవిత భాగస్వామి వృత్తి పెన్ష‌న‌ర్‌(రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు)
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹62.39 LAKHS
ఆస్తులు
₹62.39 LAKHS
బాధ్యతలు
N/A

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

మున్నార్‌లోని ప‌ర్వ‌త ప్రాంత రిసార్టులు మ‌రియు టీ తోట‌లలో ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించిన‌ వారిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. డిసెంబ‌రు 2007 లో, గ‌త 400 ఏళ్ల‌లో శ‌బ‌రిమ‌ల‌ను ద‌ర్శించిన తొలి క‌మ్యూనిస్ట్ ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర సృష్టించారు. 84 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల అచ్యుతానంద‌న్ త‌న ఆరోగ్య విష‌య‌మై వైద్యులు ఆందోళ‌న చెంది ప‌లు సూచ‌న‌లు, వైద్య ప‌ర‌మైన మ‌ద్ద‌తును ఇచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న తిర‌స్క‌రించేవారు. రాష్ట్రంలో ఉచిత మ‌రియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఉద్య‌మానికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు మ‌రియు దీనికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌ను రిచ‌ర్డ్ స్టాల్‌మ‌న్ కూడా మ‌ద్ద‌తు ప‌లికేవారు. తన 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో, ఆయ‌న ఐదు సంవ‌త్స‌రాల ఆరు నెల‌ల పాటు జైలులో ఉన్నారు మ‌రియు నాలుగున్నరేళ్లు అజ్ఞాత జీవితం గ‌డిపారు.

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ రాజకీయ జీవితం

  • 2016: మ‌ళ‌ప్పుజ నుంచి బీజేపీ కి చెందిన సీ. కృష్ణ‌కుమార్‌ను ఓడించి మ‌రోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కు బ‌దులు పిన‌ర‌యి విజ‌య‌న్‌ను పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం ఎంపిక చేసింది. చివ‌రికి ఆయ‌న‌ను పార్టీ కేరళ ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల క‌మీష‌న్ ఛైర్మ‌న్‌గా నియ‌మించింది.
  • 2013: అచ్యుతానంద‌న్ స‌న్నిహిత‌ సిబ్బంది వీ కే శ‌శిధ‌ర‌న్‌(అద‌న‌పు ప్రైవేటు కార్య‌ద‌ర్శి), ఏ సురేష్‌(వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు) మ‌రియు కే బాల‌కృష్ణ‌న్‌(ప్రెస్ కార్య‌ద‌ర్శి) పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి తొల‌గించ‌బ‌డ్డారు. రాజ‌కీయంగా ఇది పెనుదుమారాన్ని సృష్టించింది.
  • 2011: 2011 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మ‌ళ‌ప్పుజ నుంచి మ‌రోసారి ఎన్నిక‌య్యారు. 2011 నుంచి 2016 మ‌ధ్య కేర‌ళ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 2006: 2006 ఎన్నిక‌లు ఆయ‌న రాజ‌కీయ జీవితంలో కీల‌కంగా నిలిచాయి. ఆ ఎన్నిక‌ల‌లో మల‌ప్పుజ సీటు నుంచి ఆయ‌న యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ త‌ర‌పున కాంగ్రెస్‌కు చెందిన స‌తీష‌న్ ప‌చేనీని 20,017 ఓట్ల తేడాతో ఓడించారు. మే 18, 2006 నుంచి మే 14, 2011 వ‌ర‌కు కేర‌ళ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
  • 2001: అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మ‌ళ‌ప్పుజ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన సతీష‌న్ ప‌చేనీను ఓడించారు.
  • 1996: 1996 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మారైకులం నుంచి కాంగ్రెస్‌కు చెందిన పీ.జే. ఫ్రాన్సిస్ చేతిలో ఓడిపోయారు.
  • 1991: మారైకులం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వీఎస్‌ తిరిగి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆయ‌న కాంగ్రెస్‌కు చెందిన డి. సుగాత‌న్‌ను ఓడించారు.
  • 1985: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స‌భ్యుడ‌య్యారు. అయితే 2009 లో క్ర‌మ‌శిక్ష‌ణ రాహిత్య కార్య‌క‌లాపాల కార‌ణంగా ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌బ‌డ్డారు.
  • 1980: సీపీఐ(ఎం) కేర‌ళ రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శి అయ్యారు.
  • 1977: ఆర్ఎస్‌పీకి చెందిన కే.కే. కుమార పిళ్లై చేతిలో అల‌ప్పుజ నుంచి ఓడిపోయారు. ఈ ఓట‌మి సీపీఎం పార్టీకి కోలుకోలేని దెబ్బ‌.
  • 1970: కేర‌ళ శాస‌న‌స‌భ‌కు మ‌రోసారి అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న తిరిగి ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆయ‌న ఆర్ఎస్‌పీ కి చెందిన కే కే కుమార పిళ్లైను ఓడించారు.
  • 1967: అలప్పుజ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేర‌ళ శాస‌న‌స‌భ‌కు అచ్యుతానంద‌న్ ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఏ. అచ్యుతాయ‌న్‌ను ఆయ‌న ఓడించారు.
  • 1957: సీపీఐ కేర‌ళ రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 1940: భార‌త క‌మ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ)లో క్రియాశీల‌క స‌భ్యుడయ్యారు.
  • 1938: ట్రేడ్ యూనియ‌న్ కార్య‌క‌లాపాల ద్వారా రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన అచ్యుతానంద‌న్ రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు.

వీ.ఎస్‌. అచ్యుతానంద‌న్ సాధించిన విజయాలు

అచ్యుతానంద‌న్‌ తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా ఆయ‌న హయాంలో ఐటీ ఎగుమ‌తుల‌లో కేర‌ళ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించి జాతీయ స‌గ‌టును దాట‌డం విశేషం. మ‌ల‌ప్పుజ ప‌ర్యాట‌క ప్రాంతాలు, కొల్లంలోని అష్ట‌ముడి ప‌ర్యాట‌క స‌ర్క్యూట్‌ల‌ను ఆధునికీక‌రించ‌డం మ‌రియు రాష్ట్రంలో చ‌ట్ట‌వ్య‌తిరేక లాట‌రీ మాఫియాను తుదిముట్ట‌డించ‌డం మొద‌ల‌న‌వి ఆయ‌న తీసుకున్న ఇత‌ర ముఖ్య‌మైన చ‌ర్య‌లు.

కొల్లం-కొల్లం టెక్నోపార్క్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఐటీ పార్క్ ఆయ‌న ఐటీ మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మ‌యంలోనే ప్రారంభ‌మై, నిర్మిత‌మైంది. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాలైన కొల్లంలోని అష్ట‌ముడి స‌ర్క్యూట్ మ‌రియు మ‌ల‌ప్పుజ‌ల‌లో పెద్ద ఎత్తున ఆధునికీక‌ర‌ణ కార్య‌క్ర‌మాలను ఆయ‌న‌ చేప‌ట్టారు.

ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ప‌లు కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు, వాటిలో ముఖ్య‌మైన‌ది మున్నార్‌లోని ప‌ర్వ‌త ప్రాంత రిసార్టులు మ‌రియు టీ తోట‌లలో ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించిన‌ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు మొద‌లైన‌వి. ఈ భూముల‌ను రిసార్టు యజమానులు మ‌రియు టాటా టీ వంటి బ‌హూళజాతి కంపెనీలు బ‌ల‌వంతంగా ఆక్ర‌మించాయి.

ఆయ‌న తీసుకున్న ఇత‌ర చ‌ర్య‌ల‌లో ప్ర‌ధాన‌మైన‌వి కోచీ-ఎమ్‌జీ రోడ్‌కు ఇరువైపులా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేయ‌డం, చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పైర‌సీకి వ్య‌తిరేకంగా పోరాటం, మ‌రియు రాష్ట్రంలో లాటరీ మాఫియాకు వ్య‌తిరేకంగా ఆయ‌న త‌న జీవిత ప‌ర్యంతం పోరాడారు. మాజీ మంత్రి ఆర్‌. బాల‌కృష్ణ‌న్ అవినీతికి వ్య‌తిరేకంగా త‌న గ‌ళాన్ని వినిపించారు మ‌రియు ప్ర‌భుత్వంలో విశ్వాసాన్ని తీసుకువ‌చ్చారు. 2013 లో ప్ర‌వ‌స్తి ఎక్స్‌ప్రెస్ జీవ‌న‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాన్ని అందుకున్నారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+