హోం
 » 
బాబుల్ సుప్రియో బోరాల్

బాబుల్ సుప్రియో బోరాల్

బాబుల్ సుప్రియో బోరాల్

బాబుల్ సుప్రియో ప‌శ్చిమ బెంగాల్‌లోని ఉత్త‌ర్‌పారా అనే ఒక చిన్న గ్రామంలో జ‌న్మించారు. డాన్ బోస్కో లైలా స్కూలు నుంచి పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేశాకా, క‌ల‌కత్తా విశ్వవిద్యాల‌యం నుంచి ఆయ‌న‌ వాణిజ్య శాస్త్రంలో బ్యాచిల‌ర్ డిగ్రీ అందుకున్నారు.

బాబుల్ సుప్రియో బోరాల్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

బాబుల్ సుప్రియో ప‌శ్చిమ బెంగాల్‌లోని ఉత్త‌ర్‌పారా అనే ఒక చిన్న గ్రామంలో జ‌న్మించారు. డాన్ బోస్కో లైలా స్కూలు నుంచి పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేశాకా, క‌ల‌కత్తా విశ్వవిద్యాల‌యం నుంచి ఆయ‌న‌ వాణిజ్య శాస్త్రంలో బ్యాచిల‌ర్ డిగ్రీ అందుకున్నారు. సంగీత క‌ళాకారుల కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న వినోద రంగంలోకే రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గాయ‌కుడిగా పూర్తి స్థాయిలో కెరీర్‌ను ప్రారంభించ‌ముందుకు, కొంత‌కాలం స్టాండ‌ర్డ్ ఛార్ట‌ర్డ్ బ్యాంకులో ప‌ని చేశారు.

బాలీవుడ్ లో కొన్ని ద‌శాబ్దాల పాటు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన పిమ్మ‌ట‌ 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో అస‌న్‌సోల్ నియోజ‌క‌వ‌ర్గ బ‌రిలో దిగి డోలా సేన్‌ను ఆయ‌న ఓడించారు. కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణాభివృద్ధి, ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న శాఖ స‌హాయ మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం భారీ ప‌రిశ్ర‌మ‌లు మ‌రియు ప్ర‌భుత్వ సంస్థ‌ల శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

మరిన్ని చదవండి
By Moumi Majumdar Updated: Monday, February 8, 2021, 01:14:44 PM [IST]

బాబుల్ సుప్రియో బోరాల్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు బాబుల్ సుప్రియో బోరాల్
పుట్టిన తేదీ 15 Dec 1970 (వ‌య‌స్సు  53)
పుట్టిన ప్రాంతం ఉత్త‌ర్‌పారా, ప‌శ్చిమ బెంగాల్
పార్టీ పేరు All India Trinamool Congress
విద్య Graduate
వృత్తి గాయ‌కుడు, సినిమా, సంగీత క‌ళాకారుడు
తండ్రి పేరు సునీల్ చంద్ర బారాల్
తల్లి పేరు సుమిత్రా బారాల్
మతం హిందూ
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

బాబుల్ సుప్రియో బోరాల్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹6.75 CRORE
ఆస్తులు :₹8.05 CRORE
బాధ్యతలు: ₹1.3 CRORE

బాబుల్ సుప్రియో బోరాల్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

వినోద రంగంలోకి ప్ర‌వేశించ‌క‌ముందు, బాబుల్ సుప్రియో త‌న పేరును సుప్రియో బోరాల్ గా మార్చుకున్నారు. 1992 లో ముంబ‌యికి త‌న మ‌కాం మార్చుకున్నాకా, క‌ళ్యాణ్‌జీ ఆయ‌నకు మొద‌టి బ్రేక్ ఇచ్చారు. దీని త‌ర్వాత ఆయ‌న‌ అమెరికా, కెన‌డాల‌లో ఆశా భోంస్లే, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి వారితో క‌లిసి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

బాబుల్ సుప్రియో బోరాల్ రాజకీయ జీవితం

2019
  • నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు.
2019
  • పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని మున్‌మున్ సేన్‌ను లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
2014
  • ఆయ‌న 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
12 July 2016 onwards
  • కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌లు, ప్ర‌భుత్వ సంస్థ‌ల శాఖ స‌హాయ‌మంత్రిగా కొన‌సాగుతున్నారు.
9 Nov. 2014 - 12 July 2016
  • కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న శాఖ స‌హాయ మంత్రిగా సేవ‌లందించారు.
1 Sep. 2014 - 9 Nov. 2014
  • ర‌వాణా, ప‌ర్యాట‌కం, సాంసృతిక శాఖ‌ల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.

గ‌త చ‌రిత్ర

2000
  • క‌హో న ప్యార్ హై సినిమాలో పాడ‌టం ఆయ‌న జీవితాన్ని మ‌లుపు తిప్పింది.
1992
  • నేప‌థ్య గాయ‌కుడిగా కెరీర్‌ను మొద‌లు పెట్టేందుకు ఆయ‌న త‌న మ‌కాన్ని ముంబ‌యికి మార్చారు.
1991
  • క‌ల‌క‌త్తా విశ్వ విద్యాల‌యం నుంచి బీ.కామ్‌ (హాన్స్‌)లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.
1985
  • పాఠ‌శాల‌లో చ‌దువుతున్న స‌మ‌యంలో అత్యంత ప్ర‌తిభాసంప‌న్నుడిగా పేరు సంపాదించారు.
1983
  • ఆల్ ఇండియా డాన్ బోస్కో మ్యూజిక్ ఛాంపియ‌న్‌గా పిలువ‌బ‌డ్డారు.

బాబుల్ సుప్రియో బోరాల్ సాధించిన విజయాలు

2014 ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించాకా, ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణాభివృద్ధి, ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న శాఖలు చేప‌ట్టి అతి పిన్న వ‌య‌సు గ‌ల మంత్రి అయ్యారు. అట్లంటా స్టేట్ కౌన్సిల్ వారు ఆయ‌న‌కు గౌర‌వ పౌర‌స‌త్వం ఇచ్చారు. గాయ‌కుడిగా త‌న కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క జీ గోల్డ్ అవార్డుతో పాటు లెక్క‌కు మిక్కిలి అవార్డుల‌ను అందుకున్నారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X