బండారు దత్తాత్రేయ భారతీయ రాజకీయ నేతల్లో మేటి నాయకుడు. భారతీయ జనతా పార్టీకి చెందిన దత్తాత్రేయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 2004 మధ్య కాలంలో 10వ, 12వ, 13వ లోక్‌సభలకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1947 ఫిబ్రవరి 26న ఆయన జన్మించారు. ఆయనను దత్తన్నగా అందరూ వ్యవహరిస్తారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1989లో వసంతతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు వైష్ణవ్ బండారు, విజయలక్ష్మిలు. బండారు దత్తాత్రేయ కొడుకు అతి చిన్న వయసులో 21 సంవత్సరాలకే మృతిచెందాడు. 2018 మే 23న గుండెపోటుతో వైష్ణవ్ చనిపోయారు.
| పూర్తి పేరు | బండారు దత్తాత్రేయ |
| పుట్టిన తేదీ | 12 Jun 1947 (వయస్సు 78) |
| పుట్టిన ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | Graduate |
| వృత్తి | సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | బండారు అంజయ్య |
| తల్లి పేరు | ఈశ్వరమ్మ |
| జీవిత భాగస్వామి పేరు | వసంత |
| జీవిత భాగస్వామి వృత్తి | NA |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.