• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
దిలీప్ ఘోష్

దిలీప్ ఘోష్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

దిలీప్ ఘోష్ ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు. ఆయ‌న ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దిలీప్ ఘోష్ బాల్యం ప‌శ్చిమ బెంగాల్‌లోనే గ‌డిచింది. ఆగ‌స్టు 1, 1964 నాడు ఆయ‌న భోలానాథ్ ఘోష్, పుష్పాల‌తా ఘోష్ దంప‌తుల‌కు జ‌న్మించారు. ఆయ‌న‌కు ముగ్గురు సోద‌రులున్నారు. పాఠ‌శాల విద్య పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌లో ప్ర‌చార‌క్‌గా చేరారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు దిలీప్ ఘోష్
పుట్టిన తేదీ 01 Aug 1964 (వ‌య‌స్సు  57)
పుట్టిన ప్రాంతం ప‌శ్చిమ్‌ మేదినీపూర్ జిల్లా
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి న్యాయ‌వాది
తండ్రి పేరు భోలానాథ్ ఘోష్
తల్లి పేరు పుష్ప‌ల‌తా ఘోష్
జీవిత భాగస్వామి పేరు NA

కాంటాక్ట్

శాశ్వత చిరునామా క‌చారీప‌ట్టీ, పీ.ఓ.+పీ.ఎస్‌. బోల్‌పూర్‌, జిల్లా. బీర్భూమ్‌, ప‌శ్చిమ బెంగాల్ - 731204
ప్రస్తుత చిరునామా క‌చారీప‌ట్టీ, పీ.ఓ.+పీ.ఎస్‌. బోల్‌పూర్‌, జిల్లా. బీర్భూమ్‌, ప‌శ్చిమ బెంగాల్ - 731204
ఈ-మెయిల్ dilipghosh64@gmail.com
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

ఇటీవ‌ల రామ‌న‌వ‌మి ఉత్సవాల‌లో చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కార‌ణంగా దిలీప్ ఘోష్ ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కారు. ఈ ఉత్స‌వాలు రామ్‌జాదా (శ్రీరాముని సంత‌తి), హ‌రామ్‌జాదా (అక్ర‌మ సంతానాని)కి మ‌ధ్య పోరాటంగా ఆయ‌న అభివ‌ర్ణించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేప‌డ‌మేగాక‌, దీనిని చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు, పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

ఖ‌ర‌గ్‌పూర్ ప‌ట్ట‌ణంలో ఇద్ద‌రు తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌లో దిలీప్ ఘోష్ హ‌స్తం ఉన్న‌ట్లు, ఆయ‌న‌ను ఒక కంట క‌నిపెట్టాల‌ని, 2017 లో ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుబ్ర‌తా బ‌క్షీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2017
    భార‌తీయ జ‌న‌తా పార్టీ, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.
  • 2016
    2016 ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో, దిలీప్ ఘోష్ ప‌శ్చిమ్ మేదినీపూర్ జిల్లాలోని ఖ‌ర‌గ్‌పూర్ స‌ద‌ర్ నియోజ‌కవ‌ర్గం నుంచి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థి గ్యాన్ సింగ్ సోహ‌న్‌పాల్‌ను ఓడించారు. 1982 నుంచి 2011 వ‌ర‌కు గ్యాన్ సింగ్ సోహాన్ పాల్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడుసార్లు గెలవగా, ఆయ‌న‌పై దిలీప్ సింగ్ విజ‌యం పెను సంచ‌ల‌నం సృష్టించింది.
  • 2015
    ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుల‌య్యారు.
  • 2014
    దిలీప్ ఘోష్ బీజేపీలో చేరారు. అనంత‌రం పార్టీ ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు.

గ‌త చ‌రిత్ర

  • Early 80s
    రాజ‌కీయాల్లోకి రాక‌ముందు దిలీప్ ఘోష్ ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌గా, అండ‌మాన్ నికోబార్ దీవుల ఇంఛార్జీగా ప‌ని చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ అధ్య‌క్షుడు కే.ఎస్‌. సుద‌ర్శ‌న్‌కు ఆయ‌న స‌హాయ‌కుడిగానూ ప‌ని చేశారు.
నికర ఆస్తులు45.36 LAKHS
ఆస్తులు 45.36 LAKHS
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X