కేంద్ర రైల్వే మంత్రిగా పని చేసిన దినేష్ త్రివేదీ రాజకీయాల్లో బాగా రాణించారు. ఆయన రాజకీయ ప్రయాణం చాలా ఒడుదొడుకులతోనూ, వివిధ పార్టీలతో సాగింది. 80 వ దశకంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, 90 వ దశకంలో జనతాదళ్ పార్టీకి తన మద్దతును ప్రకటించారు. చివరికి 90 దశకం ఆఖరులో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాలను మినహాయిస్తే, 1974 లో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఆయన చికాగోలోని డెటెక్స్ కంపెనీలో రెండేళ్లపాటు పని చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఒక లాజిస్టిక్స్ కంపెనీ లీ అండ్ మురిహెడ్‌లో పని చేశారు. 1984 లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి, కోల్‌కతాలో సొంత కంపెనీని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఆయన ఒక కన్సూమర్ ప్రొటెక్షన్ సెంటర్‌ను స్థాపించారు.
దేశ రాజకీయాల్లో నేరాలపై నియమించిన వోహ్రా నివేదికలో ఆయన పాలు పంచుకున్నారు. ఇది చివరికి సమాచార హక్కు చట్టం ఉద్యమానికి కారణమైంది. 2011 లో ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రి అయ్యారు. అయితే రైల్వే ఛార్జీలను పెంచేందుకు ఆయన నిర్ణయించడంతో, పార్టీ అధినేత్రి మమతా సూచన మేరకు ఆయన స్వల్పకాలంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మోదీ పాలనను విమర్శిస్తూ ఆయన "అచ్చే దిన్ కనుచూపు మేరలో కనబడటం లేదు, మాకు పాత చెడ్డ రోజులు" ఇవ్వమని ఆయన అన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
| పూర్తి పేరు | దినేష్ త్రివేదీ |
| పుట్టిన తేదీ | 04 Jun 1950 (వయస్సు 75) |
| పుట్టిన ప్రాంతం | న్యూ ఢిల్లీ |
| పార్టీ పేరు | All India Trinamool Congress |
| విద్య | Post Graduate |
| వృత్తి | రాజకీయ మరియు సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | దివంగత శ్రీ హీరాలాల్ త్రివేదీ |
| తల్లి పేరు | దివంగత శ్రీమతి ఊర్మిలా త్రివేదీ |
| జీవిత భాగస్వామి పేరు | డాక్టర్ మినాల్ త్రివేది |
| సంతానం | 1 కుమారులు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.