హోం
 » 
డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్

వృత్తిరీత్యా ఆయుర్వేద‌ వైద్యుడైన డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ ఛ‌త్తీస్‌ఘడ్ మాజీ ముఖ్య‌మంత్రి. జ‌న్‌సంఘ్‌లో చేర‌డం ద్వారా ఆయ‌న రాజ‌కీయ‌ల్లోకి అడుగు పెట్టారు.

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

వృత్తిరీత్యా ఆయుర్వేద‌ వైద్యుడైన డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ ఛ‌త్తీస్‌ఘడ్ మాజీ ముఖ్య‌మంత్రి. జ‌న్‌సంఘ్‌లో చేర‌డం ద్వారా ఆయ‌న రాజ‌కీయ‌ల్లోకి అడుగు పెట్టారు. క‌వ‌ర్థా మున్సిపాలిటీ కౌన్సిల‌ర్‌, ఛ‌త్తీస్‌ఘడ్ శాస‌న‌స‌భ, లోక్ సభ స‌భ్యుడిగా వివిధ హోదాల్లో ర‌మ‌ణ్ సింగ్ ప‌ని చేశారు. 1999లో ఆయ‌న లోక్ సభకు ఎన్నికయ్యారు. వాణిజ్య శాఖ స‌హాయ మంత్రిగా ప‌ని చేశారు. కేంద్ర మంత్రిగా ఇజ్రాయెల్, నేపాల్, పాల‌స్తీనా, దుబాయ్‌లో భార‌త వాణిజ్య ఫెయిర్ ఫెస్టివ‌ల్ ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే చేప‌ట్టారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్
పుట్టిన తేదీ 15 Oct 1952 (వ‌య‌స్సు  71)
పుట్టిన ప్రాంతం రాయ్‌పూర్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి వైద్యుడు
తండ్రి పేరు విఘ్ణ‌హ‌ర‌ణ్ సింగ్ ఠాకూర్
తల్లి పేరు సుధా సింగ్
జీవిత భాగస్వామి పేరు వీణా సింగ్
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా ఇంటి నెం. - 05, వింధ్యావాసిని వార్డు, రాయ్‌పూర్ నంద‌గావ్ మార్గ్, క‌వ‌ర్థా, క‌బీర్‌ధామ్ జిల్లా, ఛ‌త్తీస్‌ఘ‌డ్, పిన్ నెం. 491995
ప్రస్తుత చిరునామా సివిల్ లైన్స్‌, రాయ్‌పూర్
కాంటాక్ట్ నెంబర్ 0771-2443399
వెబ్‌సైట్ http://www.drramansingh.in/
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹5.31 CRORE
ఆస్తులు :₹5.62 CRORE
బాధ్యతలు: ₹30.7 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఉచిత వైద్యం స‌హాయం అందించేందుకు "భార‌త్ మాత చికిత్సాల‌య" అనే ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించారు.
క్రికెట్, వాలీబాల్ ఆట‌లంటే ఆయ‌న ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి. క‌వ‌ర్థాలో ఆయ‌న యూత్ క్ల‌బ్ ప్యాట్ర‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ రాజకీయ జీవితం

2008
  • డిసెంబ‌రు 12, 2008 నాడు వ‌రుస‌గా రెండోసారి ముఖ్య‌మంత్రిగా డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.
2008
  • మ‌రోసారి ఛ‌త్తీస్‌ఘ‌డ్ శాస‌న స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2004
  • ఛ‌త్తీస్‌ఘ‌డ్ శాస‌న స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2003
  • డిసెంబ‌రు 7, 2003 నాడు ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రానికి రెండో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
1999
  • పార్ల‌మెంటు స‌భ్యుడిగా 13 వ లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు.అక్టోబ‌రు 13, 1999 నుంచి జ‌న‌వ‌రి 29, 2003 వ‌ర‌కు కేంద్ర వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయమంత్రిగా సేవ‌లందించారు.
1993
  • మ‌ధ్య ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ మ‌రోసారి ఎన్నిక‌య్యారు.
1990
  • మ‌ధ్య ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికయ్యారు.

గ‌త చ‌రిత్ర

1975
  • డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ బీ.ఏ.ఎం.ఎస్ ప‌ట్టా సాధించారు. 23 ఏళ్ల ప్రాయంలో క‌వ‌ర్థాలో వైద్యుడిగా ప్రాక్టీసును ప్రారంభించారు.పేద ప్ర‌జ‌ల‌కి ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ఉచితంగా వైద్యం చేసేవారు.

డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ సాధించిన విజయాలు

2005 లో స‌ల్వాజుడంను ప్రారంభించి న‌క్స‌లైట్ ఉద్య‌మాన్ని విజ‌యవంతంగా అణచివేశారు.

ఛ‌త్తీస్‌ఘడ్ ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌రిచేందుకు చేసిన కృషికి ఐక్య‌రాజ్య స‌మితి ఆయ‌నను అభినందించింది.

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ‌ల స్థితిగ‌తులను మెరుగ‌ప‌ర‌చ‌డంలో విజ‌యం సాధించారు.

వివిధ భాష‌ల్లో ఉత్త‌మ ప‌ర్యాట‌క సాహిత్యాన్ని అందించినందుకు గానూ 2014 లో ఛ‌త్తీస్‌ఘ‌డ్ జాతీయ ఉత్త‌మ ప‌ర్యాట‌క అవార్డును సాధించింది. దీంతోపాటు త‌న హ‌యాంలో విక‌లాంగుల సాధికారత‌కు కృషి చేసినందుకు 2017 లో ఆయ‌న‌ జాతీయ అవార్డును అందుకున్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X