• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్

డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఫిజీషియ‌న్ వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. చైన్నైలోని మద్రాస్ మెడిక‌ల్ క‌ళాశాల నుంచి ఆమె ఎమ్‌బీబీఎస్ డిగ్రీ పొందారు. అంతేగాక డాక్ట‌ర్ ఎమ్‌జీఆర్ వైద్య విశ్వ‌విద్యాల‌యం నుంచి డీజీఓ కోర్సు పూర్తి చేశారు. కెన‌డా దేశంలో సోనోలాజీ మ‌రియు ఎఫ్ఈటీ థెర‌పీల‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా పొందారు. చెన్నైలోని శ్రీ రామ‌చంద్ర మెడిక‌ల్ క‌ళాశాలలో స‌హాయ ఆచార్యులుగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు.

ఐదేళ్ల త‌రువాత బీజేపీలో చేర‌డం ద్వారా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. 1999 లో ద‌క్షిణ చైన్నై జిల్లా మెడిక‌ల్ వింగ్ కార్య‌ద‌ర్శిగా ఆమె తన రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు. బీజేపీలో వివిధ హోదాల‌లో ప‌ని చేశారు, వాటిలో 2001 లో రాష్ట్ర వైద్య విభాగ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, 2005 లో ద‌క్షిణ భార‌త రాష్ట్రాల వైద్య విభాగం ఆల్ ఇండియా కో క‌న్వీన‌ర్‌గా, 2010 లో రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలిగా మ‌రియు 2013 లో జాతీయ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. 2006 మ‌రియు 2011 శాస‌న‌స‌భ ఎన్నిక‌లు మ‌రియు 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన‌ప్ప‌టికీ, ఆమెకు చాలా త‌క్కువ ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్
పుట్టిన తేదీ 02 Jun 1961 (వ‌య‌స్సు  60)
పుట్టిన ప్రాంతం నాగ‌ర్‌కోయిల్, త‌మిళనాడు
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి ఫిజీషియ‌న్‌, రాజ‌కీయ నాయ‌కురాలు
తండ్రి పేరు కుమారి అనంత‌న్
తల్లి పేరు కృష్ణ కుమారి
జీవిత భాగస్వామి పేరు డాక్ట‌ర్ పీ. సౌంద‌ర‌రాజ‌న్‌
జీవిత భాగస్వామి వృత్తి చెన్నైలోని శ్రీ రామ‌చంద్ర వైద్య క‌ళాశాలలో ఆచార్యులు
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా డోర్ నెం.4/7, లోక‌య్య కాల‌నీ, 4 వ క్రాస్ వీధి, సాలిగ్రామం, చెన్నై - 600093
ప్రస్తుత చిరునామా డోర్ నెం.4/7, లోక‌య్య కాల‌నీ, 4 వ క్రాస్ వీధి, సాలిగ్రామం, చెన్నై - 600093
కాంటాక్ట్ నెంబర్ 9840097981
ఈ-మెయిల్ drtamilisai@yahoo.co.in
వెబ్‌సైట్ http://drtamilisaibjp.com/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తండ్రి ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడైన కుమారి అనంత‌న్. ఆమె భ‌ర్త వైద్యుడు మ‌రియు చెన్నైలోని శ్రీ రామ‌చంద్ర వైద్య క‌ళాశాలలో ఆచార్యులుగా ప‌ని చేస్తున్నారు. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఫిజీషియ‌న్‌గా సేవ‌లందిస్తుండ‌టంతో త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ అంద‌రికీ సుప‌రిచితులు. ప్ర‌ముఖ త‌మిళ దిన ప‌త్రిక‌లు మ‌రియు వార ప‌త్రిక‌ల‌లో వైద్యం మ‌రియు రాజ‌కీయాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను ఆంగ్లం నుంచి త‌మిళంలోకి ఆమె అనువ‌దించారు. బీజేపీ అగ్ర‌నేత‌లు త‌మిళ‌నాడును సంద‌ర్శించిన స‌మ‌యంలోనూ వారి ఉప‌న్యాసాల‌ను త‌మిళ్‌లోకి ఆమె అనువ‌దిస్తుంటారు. త‌మిళ‌నాడు బీజేపీ కేడ‌ర్ ఆమెను "త‌మిళనాడు సుష్మాజీ" అని పిలుస్తుంటారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2013
    అఖిల భార‌త బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి అయ్యారు.
  • 2010
    బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలిగా ఆమె నియ‌మితుల‌య్యారు.
  • 2007
    త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌మిళిసై ఎంపిక‌య్యారు.
  • 2005
    బీజేపీ అఖిల భార‌త కో-క‌న్వీన‌ర్‌(ద‌క్షిణ భార‌త రాష్ట్రాల వైద్య విభాగం) గా నియ‌మితుల‌య్యారు.
  • 2001
    బీజేపీ వైద్య విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆమె నియ‌మింప‌బ‌డ్డారు.
  • 1999
    బీజేపీ ద‌క్షిణ చైన్నై జిల్లా వైద్య విభాగం కార్య‌ద‌ర్శిగా త‌మిళిసై నియ‌మితుల‌య్యారు.

గ‌త చ‌రిత్ర

  • 2021
    ఫిబ్రవరి 18వ తేదీన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను స్వీకరించారు.
  • 2019
    సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ గవర్నర్‌గా నియమితులు అయ్యారు.
  • 2014
    భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
  • 2011
    మరోసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ మూడు ఎన్నికల్లోనూ ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • 2009
    తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
  • 2006
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
నికర ఆస్తులు5.4 CRORE
ఆస్తులు 5.8 CRORE
బాధ్యతలు40 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X