• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
దురై మురుగ‌న్

దురై మురుగ‌న్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

దురై మురుగ‌న్ న్యాయ‌వాది, రాజ‌కీయ నాయ‌కుడు మ‌రియు ప్ర‌ముఖ ఉప‌న్యాస‌కులు. ఆయ‌న ప్ర‌స్తుతం ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం(డీఎంకే) ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. ఆయ‌న బీఎల్ మ‌రియు ఎంఏ చదివారు మ‌రియు వృత్తిరీత్యా న్యాయ‌వాది. దురై మురుగ‌న్ 44 ఏళ్ల‌కు పైగా శాస‌న‌ స‌భ్యుడిగా ఉన్నారు. సంద‌ర్భోచిత‌మైన ఛ‌లోక్తులు మ‌రియు అద్భుత‌మైన చ‌ర్చా నైపుణ్యాల‌కు ఆయ‌న పెట్టింది పేరు. ఆయ‌న నిర్వ‌హించిన ప‌లు మంత్రిత్వ శాఖ‌ల‌పై ఆయ‌న‌కు లోతైన విష‌య ప‌రిజ్ఞానం ఉంది. శాస‌న‌స‌భ కార్య‌క‌లాపాల ప‌రంగా ఆయ‌న స్టాలిన్ కంటే కూడా డీఎంకేలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కులు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు దురై మురుగ‌న్
పుట్టిన తేదీ 01 Jul 1938 (వ‌య‌స్సు  83)
పుట్టిన ప్రాంతం కాట్పాడి, త‌మిళ‌నాడు
పార్టీ పేరు Dravida Munetra Kazhagam
విద్య Post Graduate
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు శ్రీ దురైసామీ
తల్లి పేరు త‌వ‌సి అమ్మాల్
జీవిత భాగస్వామి పేరు శాంత కుమారి
జీవిత భాగస్వామి వృత్తి న్యాయ‌వాది
సంతానం 1 కుమారులు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా నెం. 7, 5 వ తూర్పు క్రాస్ వీధి, గాంధీన‌గ‌ర్‌, వెల్లూర్ - 632006
ప్రస్తుత చిరునామా నెం. 7, 5 వ తూర్పు క్రాస్ వీధి, గాంధీన‌గ‌ర్‌, వెల్లూర్ - 632006
కాంటాక్ట్ నెంబర్ 9444529999
ఈ-మెయిల్ duraimurugan@gmail.com
వెబ్‌సైట్ NIL
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌లు వేడెక్కిన‌ప్పుడు త‌న ఛ‌లోక్తులు మ‌రియు ముఖ క‌వ‌ళిక‌ల‌తో ఆ వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌రిచే నైపుణ్యాన్ని ఆయ‌న క‌లిగిఉండేవారు.


మాజీ ముఖ్య‌మంత్రి ఎమ్‌జీఆర్ ఆయ‌నకు పెద్ద శ్రేయోభిలాషి. ఎందుకంటే మ‌ద్రాస్‌లో దురై మురుగ‌న్‌కు ఆయ‌న సంర‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించి, ఆయ‌న ఆరేళ్ల విద్యాభ్యాస ఖ‌ర్చుల(బీఏ రెండు మ‌రియు మూడో ఏడాది ఖ‌ర్చుల‌తో పాటు, లా కాలేజీ రెండేళ్లు మ‌రియు ఎంఏ రెండు సంవ‌త‌ర్సాల ఖ‌ర్చుల‌)ను ఎమ్‌జీఆరే భ‌రించారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2009
    జూలై 13, 2009 వ‌ర‌కు ఆయ‌న ప్ర‌జా ప‌నుల శాఖ మంత్రిగా కొన‌సాగారు.
  • 2006
    ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం పార్టీ త‌ర‌పున కాట్పాడి నుంచి ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2006 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలో ప్రజా ప‌నుల శాఖా మంత్రిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.
  • 1989
    త‌న పాత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కాట్పాడి నుంచి ఆయ‌న త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా ఆ ఎన్నిక‌ల‌లో ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే 1991 లో ఆయ‌న అదృష్టం తిర‌గ‌బ‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఓడిపోయారు.
  • 1980
    రాణిపేట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ఎమ్ఎల్ఏగా ఎన్నిక‌య్యారు. అయితే 1984 ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఓడిపోయారు.
  • 1977
    రాణిపేట్ నుంచి ఆయ‌న మ‌రోసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో గెలిచారు.
  • 1971
    1971 లో కాట్పాడి నుంచి త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌కు దురై మురుగ‌న్ తొలిసారి ఎన్నిక‌య్యారు.

గ‌త చ‌రిత్ర

  • 1954
    1954 లో సీ.ఎన్ అన్నాదురై ప్ర‌సంగాల‌కు ముగ్ధుడయ్యి, 16 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న డీఎంకే పార్టీలో స‌భ్య‌త్వం తీసుకున్నారు.
నికర ఆస్తులు30.81 CRORE
ఆస్తులు 30.81 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X