• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
హెచ్ డీ దేవేగౌడ

హెచ్ డీ దేవేగౌడ

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

హెచ్‌.డీ. దేవేగౌడ భార‌త‌దేశానికి 11 వ ప్ర‌ధానమంత్రిగా మ‌రియు క‌ర్ణాట‌క రాష్ట్రానికి 14 వ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. 1996-97 మ‌ధ్య ఆయ‌న దేశ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు 1994-96 మ‌ధ్య కర్ణాట‌క రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా కూడా సేవ‌లందించారు. 1962 లో తొలిసారిగా ఆయ‌న క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ ఎన్నిక‌లలో పోటీ చేశారు. యునైటెడ్ ఫ్రంట్ త‌ర‌పున 1996 లో ఆయ‌న దేశ ప్ర‌ధాని అయ్యారు. క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న 16 వ లోక్‌స‌భ‌లో ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. దేవేగౌడ ప్ర‌స్తుతం జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్) పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు హెచ్ డీ దేవేగౌడ
పుట్టిన తేదీ 18 May 1933 (వ‌య‌స్సు  86)
పుట్టిన ప్రాంతం హోలేన‌ర‌సిపుర‌, హ‌స‌న్ జిల్లా, (క‌ర్ణాటక‌)
పార్టీ పేరు Janata Dal (samajwadi)
విద్య Others
వృత్తి వ్య‌వ‌సాయ ఇంజినీర్‌, రైతు, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు దివంగ‌త శ్రీ దొడ్డే గౌడ
తల్లి పేరు శ్రీమ‌తి. దేవ‌మ్మ
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి. చెన్న‌మ్మ‌
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి మ‌రియు సామాజిక కార్య‌క‌ర్త
ఎంతమంది కుమారులు 4
ఎంతమంది కూతుళ్లు 2

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 743, అమోఘ్, మెయిన్‌రోడ్ 2, నైన్త్ క్రాస్‌, ప‌ద్మ‌నాభ న‌గ‌ర్‌, బెంగ‌ళూరు-560070, క‌ర్ణాట‌క టెలిఫ్యాక్స్ : (080) 26891444
ప్రస్తుత చిరునామా 5, స‌ఫ్ద‌ర్‌జంగ్ వీధి, న్యూఢిల్లీ-110011, టెలిఫోన్. (011) 23794499, 23794431Fax. (011) 23010288
కాంటాక్ట్ నెంబర్ 08145273216,08175272156,08026897444,08026798999,08026862222
ఈ-మెయిల్ haradanahalli@yahoo.co.in
వెబ్‌సైట్ http://www.hddevegowda.in/home.htm
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

స‌మాజంలోని ప్ర‌తీవ‌ర్గం వారి స‌మ‌స్య‌ల‌ను ఓపిగ్గా వింటార‌న్న వ్యాఖ్య‌ల‌తో శ్రీ హెచ్‌.డీ. దేవేగౌడ‌ను అంద‌రూ భూమి పుత్రుడు లేదా మ‌ట్టి మ‌నిషి అంటుంటారు. శాస‌న‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన ప‌నిదినాల్లోనూ, అసెంబ్లీలోని లైబ్ర‌రీలో ఆయ‌న పుస్త‌క ప‌ఠ‌నంలో లీన‌మ‌య్యేవారు. దీంతోపాటు, పార్ల‌మెంట్ ఔన్న‌త్యాన్ని మ‌రియు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కాపాడ‌డంలో ఆయ‌న‌ ప్ర‌సిద్ధి చెందారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    ప్ర‌జ‌ల‌లో ఆయ‌న‌కున్న ఆద‌ర‌ణ‌, న‌మ్మ‌కం వ‌ల్ల మ‌రోసారి 16 వ లోక్‌స‌భ‌కు(మొత్తంగా ఆరోసారి) లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. సెప్టెంబ‌రు 6, 2014 న దేశ ర‌క్ష‌ణ పై నియ‌మించిన స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడ‌య్యారు.
  • 2009
    15 వ లోక్‌స‌భ‌కు, మొత్తంగా 5 వ సారి ఆయ‌న పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. ఆగ‌స్టు 31 న ర‌క్ష‌ణ‌శాఖ క‌మిటీలో సభ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
  • 2006
    2006-08 మ‌ధ్య రైల్వేల‌పై నియ‌మించిన క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2004
    ఆయ‌న‌ 14 వ లోక్‌స‌భ‌(మొత్తంగా నాలుగుసార్లు)కు తిరిగి ఎన్నిక‌య్యారు.
  • 1999
    1999 లో జ‌న‌తా పార్టీ చీలిన‌ప్పుడు దేవేగౌడ నేతృత్వంలోని జ‌న‌తాదళ్(సెక్యుల‌ర్‌) విభాగంలో మ‌ధు దండావ‌తే లాంటి చాలా మంది నాయ‌కులు చేరారు. దేవేగౌడ జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్‌)కు జాతీయ అధ్య‌క్షుడ‌య్యారు. అదే ఏడాదిలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు అయితే 2002 లో క‌న‌క‌పుర ఉపఎన్నిక‌ల‌లో ఆయ‌న విజ‌యం సాధించారు.
  • 1996
    1996 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో పీ.వీ. న‌ర‌సింహ‌రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మిని చ‌విచూసింది, అయితే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు త‌గిన సీట్ల‌ను మ‌రే ఇత‌ర పార్టీ సాధించ‌లేక‌పోయింది. దీంతో సంకీర్ణ కూట‌మి అభ్య‌ర్థిగా అదే ఏడాది, ఆయ‌న ప్ర‌ధానిగా జూన్ 1, 1996 నుంచి ఏప్రిల్ 1,1997 వ‌ర‌కు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతోపాటుగా పెట్రోలియం మ‌రియు ర‌సాయ‌నాలు, వ్య‌క్తిగ‌త‌, ప్ర‌జా విన‌తులు మ‌రియు పింఛ‌న్లు, అణు విద్యుచ్ఛ‌క్తి, హోం వ్య‌వ‌హ‌రాలు, వ్య‌వ‌సాయం, ఆహార‌శుద్ధి ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హ‌రాలు మ‌రియు ఉద్యోగిత‌, పునర్వినియోగ ఇంధ‌న వ‌న‌రుల మంత్రిగా కూడా ప‌ని చేశారు.
  • 1995
    జ‌న‌వ‌రి 1995, స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుకు గౌడ హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న వ‌ల్ల రాష్ట్రానికి విదేశీ పెట్టుబ‌డులు గ‌ణ‌నీయంగా వ‌చ్చాయి.
  • 1994
    1994 లో జ‌న‌తాద‌ళ్ క‌ర్ణాట‌క రాష్ట్ర విభాగానికి అధ్య‌క్షుడయ్యారు. ఆ ఏడాది జ‌రిగిన క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించేలా పార్టీ వెన్నంటే నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న రామ‌న‌గ‌ర నియోజ‌క‌వర్గం నుంచి గెలిచి క‌ర్ణాట‌క రాష్ట్రానికి 14 వ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
  • 1983
    1983-88 మ‌ధ్య క‌ర్ణాట‌క రాష్ట్రంలో రామ‌కృష్ణ హెగ్డే నేతృత్వంలోని జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేశారు.
  • 1975
    1975-77 మ‌ధ్య‌ అత్య‌వ‌స‌ర కాలంలో, ఆయ‌న బెంగ‌ళూరు కేంద్ర కారాగారంలో నిర్భంధించ‌బ‌డ్డారు.
  • 1972
    కాంగ్రెస్ పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన‌ప్ప‌డు దేవేగౌడ కాంగ్రెస్‌(ఓ)లో చేరారు. మార్చి 1972 నుంచి మార్చి 1976 వ‌ర‌కు ఒక‌సారి మ‌రియు న‌వంబ‌రు 1976 నుండి డిసెంబ‌రు 1977 వ‌ర‌కు మ‌రోసారి ఆ వ‌ర్గం త‌ర‌పున రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 1962
    1962 లో హోలేన‌ర‌సిపుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌కు దేవేగౌడ ఎన్నిక‌య్యారు. అనంత‌రం 1962 నుంచి 1989 మ‌ధ్య వ‌రుస‌గా ఆరు ప‌ర్యాయాలు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌వుతూ వ‌చ్చారు.
  • 1953
    1953 లో దేవేగౌడ భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మ‌రియు 1962 వ‌ర‌కు ఆ పార్టీ స‌భ్యుడిగా కొన‌సాగారు.

గ‌త చ‌రిత్ర

  • Late 1950's
    1950 చివ‌రికాలంలో హ‌స‌న్‌లోని ఎల్.వీ. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో గౌడ డిప్లొమా సాధించారు.
  • 1976
    1976 అత్య‌వ‌స‌ర కాలంలో, అంత‌ర్గ‌త భ‌ద్ర‌తా నిర్వ‌హ‌ణ చ‌ట్టం(మీసా) కింద ఆయ‌న అరెస్ట‌య్యారు.
  • 1952
    1952 నుంచి 1962 మ‌ధ్య భార‌త జాతీయ కాంగ్రెస్‌లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.
నికర ఆస్తులు3.41 CRORE
ఆస్తులు 4.27 CRORE
బాధ్యతలు86.48 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more