• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

దేశాన్ని నడిపించిన చరిష్మా గల, వివాదస్పద రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగణ్యులు. 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తెగా ఆమె బాల్యం ఒంటరితనంతో విషాదభరితంగా సాగింది. చిన్న వయసులోనే ఆమె తల్లిని కోల్పోయారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో నెహ్రు ఆమెను తరచుగా గదిలో ఉంచేవారు. ఆమె విద్యాభ్యాసం వివిధ బోర్డింగ్ స్కూళ్లలో సాగింది. 1942 లో ఫిరోజ్ గాంధీని పెళ్లాడారు. తన తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. నెహ్రు అనంతరం పార్టీలో ఎదిగి, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అయ్యారు.

పార్టీ మద్దతుతో 1996 లో ఆమె దేశ ప్రధాని అయ్యారు. పార్టీలో ఆమె సర్దుకుపోయే ధోరణిలో ఉంటారని పార్టీ సభ్యులు భావించినప్పటికీ, వాళ్ళ అంచనాలకు విరుద్దంగా, వారు వ్యతిరేకించినప్పటికీ బ్యాంకులను జాతీయం చేశారు. పార్టీలోని పలువురు ఆమెను పార్టీ నాయకురాలిగా తోసిపుచ్చినప్పటికీ, వాళ్లపై ప్రతీసారి పైచేయి సాధించి అధికారంలోకి వచ్చారు. ప్రధానిగా ఆమె హయాంలో అవినీతి ఆరోపణలు మరియు నిరంకుశ పాలనతో అత్యవసర పరిస్థితి విధించడంతో ఆమె సంకీర్ణ కూటమికి అధికారం అప్పగించాల్సి వచ్చింది. అయితే ప్రతికూల భావనలను బద్ధలు కొడుతూ 1980 లో ఆమె మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రధానిగా ఆమె తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆమె మరణానికి కారణమయ్యాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట వందల మంది సిక్కులను చంపటం, వేలాది శరణార్థులకు వోట్ హక్కులు కల్పించటం, నెల్లి మారణఖండ వంటి ఘటనలు ఆమె హయాంలో చోటు చేసుకోవడంతో 1984 లో ఆమె దారుణ హత్యకు గురయ్యారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఇందిరా గాంధీ
పుట్టిన తేదీ 19 Nov 1919
మరణం యొక్క తేదీ 31 Oct 1984 (వ‌య‌స్సు  64)
పుట్టిన ప్రాంతం అలాహాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ అఫ్ ఆగ్రా అండ్ ఔద్, బ్రిటిష్ ఇండియా
పార్టీ పేరు Indian National Congress
విద్య
వృత్తి రాజకీయ, సామాజిక కార్యకర్త
తండ్రి పేరు జవహర్ లాల్ నెహ్రూ
తల్లి పేరు కమలా నెహ్రూ
జీవిత భాగస్వామి పేరు ఫిరోజ్ గాంధీ
జీవిత భాగస్వామి వృత్తి రాజకీయ నాయకుడు
ఎంతమంది కుమారులు 2

కాంటాక్ట్

శాశ్వత చిరునామా అలాహాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ అఫ్ ఆగ్రా అండ్ ఔద్, బ్రిటిష్ ఇండియా
ప్రస్తుత చిరునామా అలాహాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ అఫ్ ఆగ్రా అండ్ ఔద్, బ్రిటిష్ ఇండియా
కాంటాక్ట్ నెంబర్ NA
ఈ-మెయిల్ NA

ఆసక్తికర అంశాలు

అధికోత్పత్తినిచ్చే విత్తనాలు, మెరుగైన సాగునీటి వసతుల కల్పించడం ద్వారా ఆమె వ్యవసాయ రంగ స్థితిగతుల్ని మార్చి ఆహారధాన్యాల్లో మిగులును సృష్టించారు. వీటితోపాటు 1974 లో అణు పరీక్షలు జరిపి దేశాన్ని ప్రపంచ అణు శక్తి గల దేశాల సరసన నిలిపారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 1980
    1980 జనవరి నుంచి కేంద్ర రక్షణ శాఖా మంత్రిగానూ సేవలందించారు.
  • 1971
    మార్చ్ 1971 నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు.
  • 1970
    జూన్ 1970 నుంచి నవంబర్ 1973 వరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖా మంత్రిగా పని చేశారు.
  • 1969
    జులై 16, 1969 నుంచి జూన్ 26, 1970 వరకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిగానూ సేవలందించారు.
  • 1967
    ప్రధాని పదవితో పాటు 1967 సెప్టెంబర్ నుంచి మార్చ్ , 1977 వరకు ; మళ్ళీ జూన్, 1972- మార్చ్ 1977 వరకు ; 1980 జనవరి నుంచి కేంద్ర అణు విద్యుత్, అంతరిక్ష మంత్రిగా పని చేశారు. సెప్టెంబర్ 5, 1967 నుంచి ఫిబ్రవరి 14, 1969 వరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా సేవలందించారు.
  • 1966
    1996 జనవరి నుంచి మార్చ్ 1977 వరకు మళ్లి జనవరి 14, 1980 నుంచి 1984 వరకు ప్రధానిగా పని చేశారు. దీంతోపాటు 1966-77 మధ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా సేవలందించారు.
  • 1964
    రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై , కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అయ్యారు.
  • 1955
    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యురాలిగా నియమితులయ్యారు.
నికర ఆస్తులుN/A
ఆస్తులు N/A
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more