Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కే ఎస్ ఈశ్వరప్ప

కే ఎస్ ఈశ్వరప్ప
కే ఎస్ ఈశ్వరప్ప కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు. దక్షిణాది రాష్ట్రాల్లో తొలితరం బీజేపీ నాయకుల్లో ఆయన ఒకరు.
By Moumi Majumdar | Monday, April 29, 2019, 05:26:05 PM [IST]

కే ఎస్ ఈశ్వరప్ప బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కే ఎస్ ఈశ్వరప్ప కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు. దక్షిణాది రాష్ట్రాల్లో తొలితరం బీజేపీ నాయకుల్లో ఆయన ఒకరు. ఈశ్వరప్ప రాష్ట్రంలో బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. 2014 లో పార్టీ ఆయనను కర్ణాటక శాసన మండలికి నామినేట్ చేయగా, మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కేబీ ప్రసన్న కుమార్, జేడీఎస్ అభ్యర్థి హెచ్ఎన్ నిరంజన్ పై పోటీ చేశారు. ఈశ్వరప్ప ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2012-13 మధ్య కాలంలో జగదీష్ షెట్టార్ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగానూ పని చేశారు.

మరిన్ని చదవండి

కే ఎస్ ఈశ్వరప్ప వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కే ఎస్ ఈశ్వరప్ప
పుట్టిన తేదీ 10 Jun 1948 (వ‌య‌స్సు  77)
పుట్టిన ప్రాంతం బళ్ళారి
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి వ్యాపారం
తండ్రి పేరు శరణప్ప
తల్లి పేరు NA
జీవిత భాగస్వామి పేరు జయలక్ష్మి
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారం
సంతానం 1 కుమారులు
వెబ్‌సైట్ http://kseshwarappa.com/

కే ఎస్ ఈశ్వరప్ప నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹8.28 CRORE
ఆస్తులు
₹10.31 CRORE
బాధ్యతలు
₹2.03 CRORE

కే ఎస్ ఈశ్వరప్ప సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

బాల్యంలో ఈశ్వరప్ప ఆటలు, సంగీతం పట్ల ఆసక్తి చూపేవారు.
వీహెచ్ పీ నాయకులు నరసింహ మూర్తి, ఈశ్వరప్పను ఆర్ఎస్ఎస్ కి పరిచయం చేయడంతో చిన్ననాటనే ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, షిమోగాలో ఆయన తన సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకొని, పలు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకునేవారు.
ఆయన తల్లితండ్రులు భూపాలం అరిక మండిలో దినసరి కూలీలుగా పని చేసేవారు.

కే ఎస్ ఈశ్వరప్ప రాజకీయ జీవితం

  • 2014 : అయితే, 2014 లో పార్టీ ఆయనను కర్ణాటక శాసన మండలికి నామినేట్ చేయగా, మండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
  • 2013 : 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, షిమోగా నుంచి మరోసారి ఈశ్వరప్ప పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయన, కాంగ్రెస్ కి చెందిన కే.బి. ప్రసన్న కుమార్ చేతిలో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • 2012 : 2012 జులైలో డీ.వీ. సదానంద గౌడ రాజీనామా చేయగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టర్ నియమితులయ్యారు. ఆయన ప్రభుత్వంలో, ఈశ్వరప్ప ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రెవిన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను చేపట్టారు.
  • 2010 : 2010 జనవరిలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి, కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • 2008 : 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించగా, బీ. ఎస్. యడ్యూరప్ప ప్రభుత్వంలో అయన విద్యుత్తు శాఖా మంత్రి అయ్యారు.
  • 2000 : 2000 లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, ఆయన కేంద్ర పట్టు బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు.
  • 1994 : 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మంచి పని తీరు కనబరచడంలో ముఖ్య పాత్ర పోషించారు.
  • 1992 : 1992లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.
  • 1989 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో, షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో, బలమైన ప్రత్యర్థి, అప్పటి ఆరోగ్య మంత్రి హెచ్.యెన్ శ్రీనివాస్ పై కేవలం 1,304 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ విజయంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కి, అప్పటి నుంచి ఒక్క 1999లో మినహాయించి అదే స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 1975 : అత్యవసర కాలంలో అరెస్ట్ అయ్యారు. బళ్లారి జైలులో గడిపారు.

గ‌త చ‌రిత్ర

  • 1970: షిమోగాలోని నేషనల్ కామర్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు, ఆయన ఆర్ఎస్ఎస్ విద్యార్ధి విభాగమైన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏ.బీ.వీ.పీ) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, షిమోగాలో ఆయన తన సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
  • 1960: ఈశ్వరప్ప తల్లితండ్రు భూపాలం అరికా మండిలో దినసరి కూలీలుగా పని చేసే సమయంలో, ఆయన కూడా తన చిన్న వయసులో వాళ్లతో కలిసి పని చేసేందుకు వెళ్లేవారు. దీనికి ఆయన తల్లి అభ్యంతరం తెలిపి, బాగా చదువుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనకు చెప్పేది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన సామజిక కార్యకర్త అయ్యారు.

కే ఎస్ ఈశ్వరప్ప సాధించిన విజయాలు

1989 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత ఒక్క 1999 లో మినహాయించి అదే స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికై, పార్టీ పనితీరులో కీలకంగా వ్యవహరించారు.
విద్యుత్తు, జల వనరులు సహా పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+